Vinay Kola
Ads: స్మార్ట్ ఫోన్ లో యాడ్స్ ఏ రకంగా విసిగిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మారిస్తే అవి మళ్ళీ రాకుండా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
Ads: స్మార్ట్ ఫోన్ లో యాడ్స్ ఏ రకంగా విసిగిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మారిస్తే అవి మళ్ళీ రాకుండా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
Vinay Kola
మీ ఫోన్ లో యాడ్స్ (Ads) విసిగిస్తున్నాయా? ఎన్నిసార్లు స్కిప్ చేస్తున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాయా? నిజానికి ఆపిల్ ఐఫోన్ లో ఈ యాడ్స్ గోల ఉండదు కానీ ఆండ్రాయిడ్ మొబైల్ లో యాడ్స్ బాగా విసిగిస్తూ ఉంటాయి. ఇవి అసలు ఆగవు. కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, యూట్యూబ్, ఫేస్బుక్ వాడుతున్నప్పుడు ఇలాంటి యాడ్స్ ఎక్కువగా వస్తూ వుంటాయి. వీటివల్ల మన డేటా, ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటాయి. ఈ యాడ్స్ నుంచి విముక్తి పొందలేక చాలా మంది విసిగిపోతూ ఉంటారు? అయితే ఇలాంటి యాడ్స్ ను ఆపేయటానికి ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ ను మార్చుకుంటే చాలు. ఇకపై వీటి సమస్య ఉండనే ఉండదు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి? ఫోన్ లో Ads రాకుండా ఎలా కంట్రోల్ చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఫోన్‌లో యాడ్స్ ఆఫ్ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ సహాయం తీసుకోనవసరం లేదు. ఫోన్ సెట్టింగ్‌లలో కొన్ని చేంజెస్ చేస్తే చాలు అవి ఆగిపోతాయి. ముందుగా మీరు స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను ఓపెన్ చెయ్యాలి. ఇక ఆ తర్వాత Google ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు Manage Your Google Account అనే దానిపై క్లిక్ చేయాలి. ఇక ఆ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే Data & Privacy ఆప్షన్ వస్తుంది. ఇక ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసినప్పుడు Personalized Ads అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ Personalized Ads కింద My Ad Center అనే ఆప్షన్ ఉంటుంది.ఇక దానిపై క్లిక్ చేసి స్క్రీన్ పైన కుడివైపున ఉన్న Personalized Ads టోగుల్ ని ఆఫ్ చేయాలి. ఆ తరువాత Settings ఓపెన్ చేసి గూగూల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక Manage Your Google Account కింద Services on this Device సెక్షన్లో Ads ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ Delete Advertising ID కనిపిస్తుంది. దానిని ట్యాప్ చేసి డిలీట్ చేయాలి.
ఈ విధంగా చేస్తే ఇకపై మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో యాడ్స్ రాకుండా ఈజీగా ఆగిపోతాయి. ఇలా ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే ఇకపై మీకు ఎలాంటి అనవసరమైన యాడ్స్ రానే రావు. కాబట్టి కచ్చితంగా ఈ సెట్టింగ్స్ మార్చుకోండి. యాడ్స్ నుంచి విముక్తి పొందండి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.