RBI: RBI కొత్త రూల్స్.. ఈ Bankల కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్స్ చేయలేరు.. కారణం ఇదే!

RBI కొత్త రూల్స్.. ఈ Bankల కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్స్ చేయలేరు.. కారణం ఇదే!

RBI: ఆ బ్యాంకుల కస్టమర్లకు బిగ్ అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త రూల్స్ తో ఈ బ్యాంకుల కస్టమర్లు ఆన్ లైన్ పేమెంట్స్ చేయలేరు. కారణం ఏంటంటే?

RBI: ఆ బ్యాంకుల కస్టమర్లకు బిగ్ అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త రూల్స్ తో ఈ బ్యాంకుల కస్టమర్లు ఆన్ లైన్ పేమెంట్స్ చేయలేరు. కారణం ఏంటంటే?

డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చాక చెల్లిపుల ప్రక్రియ మరింత సులభంగా మారిపోయింది. కిరాణా కోట్టు నుంచి మొదలుకొని షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటి వాటి వరకు ఆన్ లైన్ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సంస్థలు ఆన్ లైన్ పేమెంట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు, ఇరత ఆన్ లైన్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఈ రూల్స్ జులై 01 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకుల కస్టమర్లకు బిగ్ షాక్ తగలబోతున్నది. ఇకపై వారు ఆన్ లైన్ పేమెంట్స్ చేసే వీలు ఉండకపోవచ్చు. ఇంతకీ ఆ బ్యాంకులు ఏవంటే?

ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా జరిగే అన్ని ఆన్ లైన్ చెల్లింపులు ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరగాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే ఫేక్ పేమెంట్స్, మోసపూరిత లావాదేవీలను ట్రాక్ చేయడానికి కొత్త రూల్ ను తీసుకొచ్చింది. అయితే రూల్స్ అమలులోకి వచ్చి నాలుగు రోజులు అవుతున్నా కొన్ని బ్యాంకులు బీబీపీఎస్ తో ఇంకా లింకప్ కాలేదు. ఇప్పటి వరకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు బిబిపిఎస్‌ని యాక్టివేట్ చేయలేదు. దీంతో ఆన్ లైన్ లో బిల్లు పేమెంట్లకోసం ఫోన్‌పే, క్రెడ్, బిల్ డెస్క్, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్ లు చెల్లింపులను ప్రాసెస్ చేయలేవు.

దీంతో ఆ బ్యాంకుల కస్టమర్లపై ప్రభావం చూపుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ , సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు వంటి ప్రధాన బ్యాంకుల కస్టమర్లు ఫోన్‌పే, క్రెడ్, బిల్ డెస్క్, అమెజాన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా క్రెడిట్ కార్డు, ఇతర బిల్లుల చెల్లింపులను చేయలేరు. దీంతో ఆన్ లైన్ లో బిల్లులు చెల్లించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బీబీపీఎస్‌ని యాక్టివేట్ చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ కార్డ్, బీఓబీ కార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.

Show comments