P Venkatesh
Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. మీ పనులుంటే ముందే చూసుకోండి. ఇంతకీ ఏయే తేదీల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయంటే?
Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. మీ పనులుంటే ముందే చూసుకోండి. ఇంతకీ ఏయే తేదీల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయంటే?
P Venkatesh
బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. వరుసగా ఆరు రోజులు సెలవులు రానున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులకు సెలవులను ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలో సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు ఏకంగా 6 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లోల ఆది, శని వారాలతో పాటు పండగలు ఉన్నాయి. అయితే ఈ సెలవులు దేశంలోని రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. సెలవులు ఎప్పుడెప్పుడున్నాయో తెలుసుకోకపోతే మీ టైమ్ వృథా అవుతుంది. మీ పనుల్లో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకీ సెలవులు ఏయే తేదీల్లో ఉండనున్నాయంటే?
ప్రస్తుత కాలంలో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంక్ సేవలను వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా, లోన్స్ కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నారు. కాగా పలు బ్యాంకింగ్ సేలవు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నప్పటికీ ఖాతాకు సంబంధించిన సమస్యలు, క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన సమస్యలు, లోన్స్ కోసం నేరుగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో బ్యాంకు సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుంటే మేలు. కాగా సెప్టెంబర్ 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
సెప్టెంబర్ 13: రామ్‌దేవ్ జయంతి/ తేజ దశమి (శుక్రవారం) – రాజస్థాన్
సెప్టెంబర్ 14: రెండో శనివారం/ ఓనం – భారతదేశం అంతటా/కేరళ
సెప్టెంబర్ 15: ఆదివారం/ తిరువోణం – భారతదేశం అంతటా/కేరళ
సెప్టెంబర్ 16: ఈద్-ఎ-మిలాద్ (సోమవారం)- భారతదేశం అంతటా
సెప్టెంబర్ 17: ఇంద్ర జాతర (మంగళవారం) – సిక్కిం
సెప్టెంబర్ 18: శ్రీ నారాయణ గురు జయంతి (బుధవారం) – కేరళ