గుడ్ న్యూస్.. మహిళలు ఫ్రీగా 10 లక్షలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

గుడ్ న్యూస్.. మహిళలు ఫ్రీగా 10 లక్షలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు బ్యాంకులు ఉచితంగా 10 లక్షలు అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇంతకీ ఏయే బ్యాంకులు అంటే?

మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు బ్యాంకులు ఉచితంగా 10 లక్షలు అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇంతకీ ఏయే బ్యాంకులు అంటే?

మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఆ పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తూ వారిని వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటునందిస్తున్నాయి. మహిళలు ఈ స్కీమ్స్ ప్రయోజనాలను అందుకొని చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు. కుటుంబాన్ని చక్కదిద్దుకోవడంలో, డబ్బును మేనేజ్ చేయడంలో మహిళలు కీలకంగా వ్యవహరిస్తారు. అయితే మహిళలు అనారోగ్యాల భారిన పడినప్పుడు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేక అకౌంట్లను తీసుకొచ్చాయి. వీటి ద్వారా ఉచితంగా 10లక్షలు పొందొచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళా శక్తి సేవింగ్స్ ఖాతా:

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలో ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అందుబాటులో ఉంది. అలాణే 70 ఏళ్లపాటు రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీని అందజేస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళల కోసం రెండు స్పెషల్ సేవింగ్స్ అకౌంట్స్ ని ప్రారంభించింది. అవి.. 1. మహిళా శక్తి సేవింగ్స్ అకౌంట్. 2. ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్. ఈ స్పెషల్ అకౌంట్స్ ని మహిళలు జూన్ 30 వరకు ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్స్ ద్వారా డిసెంబర్ 31,2024 వరకు రుణాలు కూడా పొందొచ్చు. అయితే జూన్ 30 వరకు ఓపెన్ చేసిన ఖాతాలకు మాత్రమే బ్యాంక్ ఆఫ్ బరోడా అందించే ప్రయోజనాలు వర్తించనున్నాయి. ఈ ప్రత్యేకమైన అకౌంట్ల ద్వారా విస్తృత ప్రయోజనాలు అందించనుంది. రూ. 25 లక్షల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ డబ్బును తీసుకునే వీలు కల్పిస్తోంది.

హెచ్ డీఎఫ్ సీ ఉమెన్ సేవింగ్ అకౌంట్:

దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీ మహిళల కోసం ప్రత్యేక అకౌంట్ ను తీసుకొచ్చింది. మహిళలు ఇందులో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసే భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు. మహిళల కోసం సేవింగ్స్ అకౌంట్ కి ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది బ్యాంకు. ఈ అకౌంట్ ద్వారా ప్రమాద మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా లభిస్తుంది. ఆసుపత్రిలో చేరితే రూ.లక్ష కవరేజీ ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ సమృద్ధి సేవింగ్స్ అకౌంట్‌:

యూనియన్ బ్యాంక్ యూనియన్ సమృద్ధి సేవింగ్స్ అకౌంట్‌ను ప్రత్యేకంగా మహిళల కోసం తీసుకొచ్చింది. ఇందులో డెబిట్ కార్డుతో రూ.50 లక్షల విమాన ప్రమాద బీమా లభిస్తుంది. 5 లక్షల రూపాయల ఉచిత వ్యక్తిగత ప్రమాద కవరేజీ అందుబాటులో ఉంది. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తే చికిత్స కోసం రూ.5 లక్షలు పొందొచ్చు.

Show comments