iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: షాకింగ్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా!

  • Published Sep 14, 2024 | 9:52 PM Updated Updated Sep 14, 2024 | 9:52 PM

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అప్పుడే రెండో వారం చివరకు వచ్చేసింది. తొలివారంలో బెజవాడ బేబక్క బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యిన సంగతి తెలిసింది. ఈ సారి అందరీ బిగ్ బాస్ ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అప్పుడే రెండో వారం చివరకు వచ్చేసింది. తొలివారంలో బెజవాడ బేబక్క బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యిన సంగతి తెలిసింది. ఈ సారి అందరీ బిగ్ బాస్ ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

  • Published Sep 14, 2024 | 9:52 PMUpdated Sep 14, 2024 | 9:52 PM
Bigg Boss 8: షాకింగ్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున చెప్పినట్లే ఈ సీజన్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే తొలివారంలో అనూహ్యంగా బేజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లారు. అయితే తాజాగా ఎవరు ఊహించని విధంగా ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లడానికి శేఖర్ భాష, పృధ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య, నాగ మణికంఠ, నైనిక, సీత, విష్ణు ప్రియ లు నామినేట్ అయ్యి ఉన్నారు. వీరంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. మరి వీరిలో ఎవరు బయటకు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే అందరికీ ట్విస్టు ఇస్తూ..ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అందుకు కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో శేఖర్ బాషా తండ్రైనట్లు నాగార్జున చెప్పిన సంగతి తెలిసింది. శేఖర్ బాషా భార్య పండంటి బిడ్డకు జన్మన్చింది. ఈ కారణంగానే శేఖర్ బాషాని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటా ఎలిమినేషన్ తప్పనిసరి అనే విషయం తెలిసింది. కాబట్టి..  తన బిడ్డను చూసుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో శేఖర్ బాషాని హౌస్‌ లో నుంచి ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపిస్తున్నారని సమాచారం.

వాస్తవానికి ఈవారంలో ఆదిత్య ఓం, పృథ్వీ, సీత ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా  అనుకున్నారు. అయితే శేఖర్ బాషా తండ్రి కావడంతో హౌస్ నుంచి వెళ్తున్నారని టాక్. కాబట్టి.. ఈవారంలో ఎలిమినేషన్ కోటాని శేఖర్ తో పూర్తి చేయిస్తున్నారు. అలా ఈవారంలో డేంజర్ జోన్‌లో ఉన్న, సీత, ఆదిత్య ఓం, పృథ్వీ‌లు సేవ్ అయిపోయినట్టే. అయితే ఖచ్చితంగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది తెలియాలంటే మాత్రం ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆదివారం మాత్రమే తెలుస్తుంది. కాని శనివారమే ఆ ఎపిసోడ్ షూట్ అయిపోతుంది. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు శేఖర్ బాషా ఎలిమినేట్ అనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మరి..శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని వస్తున్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి:

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet