iDreamPost
android-app
ios-app

Bigg Boss Eliminations: సోనియా ఖాతాలో మరో వికెట్.. ఈ వీక్ పృథ్వీ ఎలిమినేషన్?

  • Published Sep 14, 2024 | 6:20 PM Updated Updated Sep 14, 2024 | 6:20 PM

Bigg Boss Telugu 8- Speculations On Prithviraj Elimination: బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోంది అని గట్టిగానే లీకులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్న పృథ్వీరాజ్ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు అంటున్నారు.

Bigg Boss Telugu 8- Speculations On Prithviraj Elimination: బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోంది అని గట్టిగానే లీకులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్న పృథ్వీరాజ్ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు అంటున్నారు.

  • Published Sep 14, 2024 | 6:20 PMUpdated Sep 14, 2024 | 6:20 PM
Bigg Boss Eliminations: సోనియా ఖాతాలో మరో వికెట్.. ఈ వీక్ పృథ్వీ ఎలిమినేషన్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? అనే ప్రశ్న చాలా బాగా వినిపిస్తోంది. అలాగే ఈ వీక్ నాగార్జున ఎవరిని ప్రశంసిస్తారు? ఎవరికి క్లాసులు పీకుతారు? అని కూడా ఆడియన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు షాకింగ్ సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ గురించే మాట్లాడుకోవాలి. ఎలిమినేషన్ కి సంబంధించి షాకింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకు పృథ్వీ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నాడు అంటూ గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం సోనియా అంటూ విమర్శలు చేయడం గమనార్హం. అసలు పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా ఎంతో స్ట్రాంగ్ అనుకున్న ప్లేయర్స్ రెండు, మూడు వారాల్లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేయచ్చు. తొలి వీక్ బేబక్క ఎలిమినేట్ అవుతుంది అని ఎవరూ అనుకోలేదు. కానీ, ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అలాగే ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ కాబోతున్నాడు అంటున్నారు. పృథ్వీరాజ్ శెట్టి నిజానికి చాలా స్ట్రాంగ్ ప్లేయర్. కానీ, అతను ఆట మీద శ్రద్ధ చూపించడం లేదు అనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. అయితే ఓటింగ్ పరంగా కదా హౌస్ నుంచి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసేది అని మీరు అనచ్చు. అయితే ఆ కంటెస్టెంట్ ఉంటే షోకి మంచిది అనుకుంటే మాత్రం.. కచ్చితంగా ఏమైనా జరగచ్చు. అసలు ఆ వాదన ఎందుకు వచ్చిందో పరిశీలిద్దాం.

ఇదంతా కేవలం అనధికారిక ఓటింగ్, సోషల్ మీడియా ట్రెండ్స్ ఆధారంగా తీసుకున్న గణాంకాలు మాత్రమే. ఇది ఎలాంటి అధికారిక సమాచారం కాదు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. నాగ మణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, సీత, నైనికా, శేఖర్ బాషా, నిఖిల్, పృథ్వీ నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే విష్ణుప్రియకు చాలా మంచి ఓట్లు పడతాయి. ఎందుకంటే విష్ణుకి స్వతహాగానే ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే సోనియా వల్ల ఆమెకు పాజిటివీటి పెరిగింది. ఇంక నిఖిల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్.. గ్రాఫ్ తగ్గినా కూడా మళ్లీ గాడిలో పడ్డాడు. ఇంక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. అందుకే ఓట్ల విషయంలో ఢోకా లేదు. ఇంక నాగ మణికంఠ కూడా ఎంతో స్ట్రాంగ్ ప్లేయర్ లా మారుతున్నాడు. మంచి కంటెంట్ కూడా ఇస్తున్నాడు. ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి.

ఓటింగ్ పరంగా చూసుకుంటే పృథ్వీకి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. లీస్ట్ పొజిషన్ లో శేఖర్ బాషా, అతని తర్వాత ఆఖరి స్థానంలో సీత ఉన్నారు. అయితే ఇక్కడ హౌస్ లో కాస్తో కూస్తో కామెడీ చేస్తోంది శేఖర్ బాషా.. అతడిని పంపేస్తే ఇంక సీజన్ పరిస్థితి ఏంటి అనేది బిగ్ బాస్ కే తెలియాలి. కానీ, టాస్కుల్లో మాత్రం శేఖర్ బాషా పర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే. అది బాషాకి బాగా మైనస్ అవుతుంది. ఇంక సీత అంటారా.. ఓట్లు తక్కువ పడినా కూడా ఆడపులిలా ఆట ఆడుతోంది. ఎక్కడా కూడా తగ్గడం లేదు. మంచి ఆర్గుమెంటల్ స్కిల్స్, మంచి ఎమోషనల్ స్టోరీ, టాస్కుల్లో కూడా ప్రాణం పెట్టి ఆడుతోంది. కాబట్టి అయితే శేఖర్ బాషాని అయినా పంపుతారేమో గానీ.. సీతను మాత్రం పంపలేరు అని చెప్పాలి. గత సీజన్ లో నయని పావనీని పంపేసినట్లు సీతను పంపేస్తే.. అంత తల్లకిందులు అయిపోతుంది.

ఇంక మిగిలింది కేవలం పృథ్వీ మాత్రమే. హౌస్ లో పని సరిగ్గా చేయడం లేదు. టాస్కుల్లో అగ్రెషన్ చూపించడం తప్పితే ఏం చేయడం లేదు. టాస్కులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు. భాష ప్రధాన అడ్డంకిగా మారుతోంది. పైగా టాస్కుల్లో F వర్డ్స్ వాడుతున్నాడు అంటూ ప్రోమోలో నాగార్జున సీరియస్ కూడా అయ్యాడు. ఇదంతా చూసుకుంటే పృథ్వీపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ క్రెడిట్ మాత్రం సోనియాకి దక్కుతుంది అంటున్నారు. చిన్న దొర, చిన్న దొర అంటూ పృథ్వీని బాగానే తోసేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి వారం బేబక్కను, రెండో వారం పృథ్వీని బలి చేసింది అంటూ కాస్త గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio