iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: తండ్రైన బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా!

  • Published Sep 14, 2024 | 8:57 PM Updated Updated Sep 14, 2024 | 9:15 PM

Bigg Boss 8 Shekar Basha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారం చివరకి చేరుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో శేఖర్ బాషాకు నాగార్జున్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

Bigg Boss 8 Shekar Basha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారం చివరకి చేరుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో శేఖర్ బాషాకు నాగార్జున్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

  • Published Sep 14, 2024 | 8:57 PMUpdated Sep 14, 2024 | 9:15 PM
Bigg Boss 8: తండ్రైన బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఒక వారం పూర్తవగా రెండో వారాన్ని కూడా పూర్తి చేసుకోబోతుంది. ఈక్రమంలోనే బిగ్ బాస్ వీకెండ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలానే ఈవారం  బిగ్ బాస్ వీకెండ్ కూడా వచ్చింది. ఈ వారం కంటెస్టెంట్స్‌ తప్పులను గురి చూపిస్తు ఫైర్‌ అయ్యారు నాగ్‌. తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూస్తుంటే ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌ ఫుల్‌ హీట్‌ పెంచేసేలా కనిపిస్తుంది. ఇదే సమయంలో మరో ప్రోమో సర్ ప్రైజ్, ఎమోషన్స్ తో సాగింది. ఇందులో శేఖర్ భాషాకు నాగార్జున్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శేఖర్ బాష తండ్రైయ్యాడు.

బిగ్ బాస్ కు సంబంధించి ఇక తాజాగా విడుదలైన రెండో ప్రోమో ఎంతో ఆసక్తికరంగా ఉంది. ప్రోమో చూసినట్లు అయితే బిగ్ బాస్ హౌస్ లో మేజర్‌ చేంజస్‌ జరగబోతున్నాయంటూ  నాగార్జున ట్విస్ట్‌ ఇచ్చాడు. ఆ తర్వాత శేఖర్‌ భాషా తండ్రి అయ్యాడనే  గుడ్‌న్యూస్‌ అందించాడు హోస్ట్‌ నాగార్జున. ఆ సమయంలో శేఖర్‌ బాషా ఎమోషనలైన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. హౌస్ లోకి వచ్చేముందు శేఖర్ బాష భార్య గర్భవతిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన భార్య కాసేపటి క్రితమే ప్రసవించింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున శేఖర్‌ భాషాకు తెలిపారు. అది శేఖర్‌ భాషా ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్  అంతా కూడా సర్‌ప్రైజ్‌ అయ్యారు. శేఖర్ బాషా కొడుకు పుట్టినాడు అనే వార్తపై మిగతా హౌస్ మేట్స్‌ కూడా ఆయనతో పాటు భావోద్వేగానికి లోనయ్యారు. కాసేపటి తరువాత అందరూ శేఖర్‌ భాషాకు శుభకాంక్షలు తెలిపారు.

ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఈవారంలో 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఆదిత్య ఓం, పృథ్వీ, సీత ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ చాలా మంది భావించారు. అయితే తాజాగా శేఖర్ బాషా తండ్రి కావడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారని టాక్.  మొత్తంగా ఈవారంలో ఎలిమినేషన్  ను శేఖర్ బాషాతో పూర్తి చేయిస్తున్నారు. అలా ఈవారంలో డేంజర్ జోన్‌ లో ఉన్న ఆదిత్య ఓం, పృథ్వీ‌లు సేవ్ అయిపోయినట్టే. మరి.. శేఖర్ బాషాకు కొడుకు పుట్టిన సందర్భంగా ఆయనకు విషెష్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş