iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: హౌస్ మొత్తాన్ని ఏడిపించేసిన కిర్రాక్ సీత.. ఐదేళ్ల ప్రేమ తర్వాత..

  • Published Sep 13, 2024 | 2:11 PM Updated Updated Sep 13, 2024 | 2:11 PM

Bigg Boss Telugu 8- Kirrak Seetha Emotional Breakup Story: బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు కేవలం గొడవలు, కామెడీ మాత్రమే చూశారు. ఇప్పుడు ఎమోషనర్ పార్ట్ స్టార్ట్ కాబోతోంది. ఆడియన్స్ ని ఏడిపించేందుకు బిగ్ బాస్ రెడీ అయిపోయాడు.

Bigg Boss Telugu 8- Kirrak Seetha Emotional Breakup Story: బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు కేవలం గొడవలు, కామెడీ మాత్రమే చూశారు. ఇప్పుడు ఎమోషనర్ పార్ట్ స్టార్ట్ కాబోతోంది. ఆడియన్స్ ని ఏడిపించేందుకు బిగ్ బాస్ రెడీ అయిపోయాడు.

  • Published Sep 13, 2024 | 2:11 PMUpdated Sep 13, 2024 | 2:11 PM
Bigg Boss 8: హౌస్ మొత్తాన్ని ఏడిపించేసిన కిర్రాక్ సీత.. ఐదేళ్ల ప్రేమ తర్వాత..

బిగ్ బాస్ హౌస్ అంటే కేవలం ఆటలు, పాటలు, టాస్కులు మాత్రమే కాదు.. కన్నీళ్లు పెట్టించే కథలు, హృదయాలను పిండేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ తమ వాళ్లని మిస్ అవుతారు అని అందరికీ తెలిసిందే. అందుకే వారికి సంబంధించిన వస్తువులను తెప్పించి.. వాటి వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ కు బాగా పాజిటివ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి కేవలం రెండు వారాలు కూడా కాకుండానే ఆడియన్స్ ని ఏడిపించేయాలి అని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు. అందుకే కంటెస్టెంట్స్ కి ఎమోషనల్ బాండింగ్ ఉండే వస్తువులను హౌస్ లోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అందరి స్టోరీలు బయటకు వచ్చాయి.

ఈ టాస్క్ ఏంటంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి బాగా ఎమోషనల్ బాండింగ్ ఉన్న వస్తువులను తీసుకొచ్చారు. ఇద్దరు వ్యక్తులను అక్కడ నిల్చోబెడతారు. వారు వాళ్ల స్టోరీ చెప్పాల్సి ఉంటుంది. వాళ్ల పాయింట్స్ కి హౌస్ మేట్స్ ఎంత కనెక్ట్ అవుతారు అనేది ముఖ్యం. కనెక్ట్ అయిన సభ్యులు వారికి లాలీపాప్స్ ఇస్తారు. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లకి వచ్చిన వస్తువును దక్కించుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక స్టోరీని చెప్తూ వచ్చారు. ప్రస్తుతానికి ప్రోమో ప్రకారం సీత- అభయ్- నిఖిల్- నైనికా స్టోరీలు మాత్రమే తెలిశాయి. వాటిలో కిర్రాక్ సీత అందరినీ ఏడిపించేసింది. తాను ఒక వ్యక్తితో దాదాపు ఐదేళ్ల వరకు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత అతను సడెన్ గా తనని వదిలేసి వెళ్లిపోయాడు అని చెప్పింది.

అప్పుడు తనకు ఒక ట్రూ ఫ్రెండ్ దొరికినట్లు సీత చెప్పుకొచ్చింది. కుమారన్ నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటూ ఏడ్చేసింది. ఇంక అలాగే నైనికా కూడా తాను ఒక అబ్యూసివ్ రిలేషన్ లో ఉన్న విషయాన్ని పంచుకుంది. నైనికా- సీత ఇద్దరీ బ్రేకప్ స్టోరీ అయితే.. అభయ్- నిఖిల్ ఇద్దరిది మాత్రం ఫాదర్ సెంటిమెంట్. అభయ్ తనకు వచ్చిన తొలి జీతంతో తన తండ్రికి కొనిచ్చిన వాచ్ ని పంపించారు. ప్రస్తుతం అభయ్ తండ్రి లేడు కాబట్టి అతను ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. ఇంక నిఖిల్ కి తన ఫాదర్ షర్ట్ ని పంపించారు. కొడుకుకి ఫాదర్ ని హగ్ చేసుకునేంత బాండింగ్ ఉండదు కాబట్టి.. తన షర్ట్ అలా దొంగతనం చేశాను అంటూ చెప్తాడు. అయితే నిఖిల్ త్యాగం చేసినట్లు కనిపించింది. అభయ్ తనని ఓదారుస్తూ కనిపించాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ని కన్నీళ్లు పెట్టిస్తుంది అని అర్థమవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom