iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: షాకింగ్.. బిగ్ బాస్ నుంచి శివాజీ ఎలిమినేటెడ్!

  • Published Dec 16, 2023 | 9:57 PM Updated Updated Dec 17, 2023 | 10:44 PM

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఎవ్వరూ ఊహించని, షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. మూడో స్థానంలో శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక టైటిల్ పోరులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మాత్రమే మిగిలారు.

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఎవ్వరూ ఊహించని, షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. మూడో స్థానంలో శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక టైటిల్ పోరులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మాత్రమే మిగిలారు.

  • Published Dec 16, 2023 | 9:57 PMUpdated Dec 17, 2023 | 10:44 PM
Bigg Boss 7: షాకింగ్.. బిగ్ బాస్ నుంచి శివాజీ ఎలిమినేటెడ్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7. ఈ షో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఉల్టాపుల్టా అంటూ ప్రారంభమైన ఈ సీజన్.. అందుకు తగ్గట్లుగానే సాగుతూ వచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ చివరి ఘట్టానికి చేరువైంది. ఆదివారం తో బిగ్ బాస్ 7 ఆట ముగిసింది. కాగా.. బిగ్ బాస్ సీజన్ 7 లో మొత్తం ఆరుగురు ఫైనలిస్ట్ లు ఉంటే వీళ్లలో ఆరో స్థానంలో అంబటి అర్జున్, ఐదో స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక మరో ఫైనలిస్ట్ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్ కేస్ తీసుకుని నాలుగో స్థానంలో బయటకు రావడం ఈ ఉల్టా పుల్టా సీజన్‌లో ఊహించని ట్విస్ట్. తాజాగా మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. అందరూ బిగ్ బాస్ విన్నర్ అవుతాడు అనుకున్న మూడో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్  బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఊహించని, షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. అందరూ శివాజీ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా శివాజీ మూడో స్థానంలో ఎలిమినేషన్ అయ్యాడు. ఇతడి ఎలిమినేషన్ ప్రక్రియను నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ నిర్వహించారు. ‘డెవిల్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరు బిగ్ బాస్ స్టేజీపై సందడి చేశారు. ఇక మిగిలింది అమర్‌, ప్రశాంత్.. వీరిద్దరిలోనే ఒకరు విన్నర్.. ఒకరు రన్నర్ కాబోతున్నారు. దీంతో విన్నర్ ఎవరు అవుతారనే విషయంపై అందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక నటుడు శివాజీ మూడో స్థానంలో ఎలిమినేట్ కావడంతో అమర్ దీప్ పై చేయి సాధించినట్లు అయ్యింది.

అంతేకాక హౌస్ లో చాలా సార్లు అమర్ దీప్ ను.. నీది గెలిచే మొహమేనా అంటూ మొహంపై కొట్టినట్లుగా అవమానించాడు. అయితే అమర్ దీప్ ఉండగా.. శివాజీ మూడో స్థానంలో ఎలిమినేట్ కావడంతో అతడిపై అమర్ పై చేయి సాధించాడని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. ఇక ప్రశాంత్, అమర్‌ల మధ్య టఫ్ ఫైట్ ఉంది. వీళ్లిద్దరి మధ్య ఓటింగ్ నువ్వా నేనా అంటూ సాగిందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య విన్నర్ రేస్ మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మరి.. శివాజీ మూడో స్థానంలో ఎలిమినేట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş