iDreamPost
android-app
ios-app

Sivaji: పిచ్చి మాటలు మాట్లాడితే బాగోదు.. శోభాకి శివాజీ వార్నింగ్!

  • Published Dec 28, 2023 | 10:03 PM Updated Updated Dec 28, 2023 | 10:03 PM

శోభాశెట్టి.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈమెకు తెలుగులో ఊహించని రీతిలో క్రేజ్‌ని వచ్చింది. అయితే ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొన్న ఈమె శివాజీపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. శోభా శెట్టి చేసిన కామెంట్స్‌కి శివాజీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

శోభాశెట్టి.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈమెకు తెలుగులో ఊహించని రీతిలో క్రేజ్‌ని వచ్చింది. అయితే ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొన్న ఈమె శివాజీపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. శోభా శెట్టి చేసిన కామెంట్స్‌కి శివాజీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

  • Published Dec 28, 2023 | 10:03 PMUpdated Dec 28, 2023 | 10:03 PM
Sivaji: పిచ్చి మాటలు మాట్లాడితే బాగోదు.. శోభాకి శివాజీ వార్నింగ్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇటీవలే ఏడో సీజన్ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ షోల్లో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈషోలో ఇక కంటెస్టెంట్స్ మధ్య జరిగే వాగ్వాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సీరియల్ నటి శోభాశెట్టి, శివాజీ మధ్య  కూడా గోడవలు జరుగుతుండే. తాజాగా అక్కడ జరిగిన సంఘటన గురించి నటుడు శివాజీ ఓ ఇంటర్వూల్లో షేర్ చేసుకున్నారు. మరి.. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా..

బిగ్ బాస్ సీజన్ 7లో 97వ ఎపిసోడ్‌లో శివాజీ బండారం మొత్తం బయటపెడతానంటూ శోభాశెట్టి శపథం చేయడం తెలిసిందే. దీంతో ఆమెను నాగార్జున కన్ఫెషన్ రూంకి పిలిచారు. ఆ సమయంలో శోభాశెట్టి.. శివాజీ ప్రాంతీయ భేదం చూపిస్తున్నారంటూ నాగార్జునకి ఫిర్యాదు చేసింది. శివాజీ ప్రతిసారి.. మేము (ప్రియాంక, శోభా) పరాయి భాష నుంచి వచ్చామని.. ఫేవరిజం అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారనిని ఫిర్యాదు చేసింది. ఇక్కడ ప్రాంతీయ భావం అనే ఇక్కడ ఏం ఉండదు.. నువ్వు మా మోనితవే.. బిగ్ బాస్ శోభా శెట్టివేనని అన్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ ఇష్యూపై శివాజీ స్పందించారు. శోభాశెట్టి తనపై చేసిన ఆరోపణల్నిఖండిస్తూ శివాజీ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ…శివాజీ అనేవాడిని టార్గెట్ చేస్తే ఎంతో కొంత అటెన్షన్ వస్తుందని కావాలనే తనతో గొడవలు పెట్టుకునేవాళ్లని శివాజీ అన్నారు. ఇక తనకు నచ్చని విషయం ఏంటంటే తాను ప్రాంతీయ భేదం చూపించానని శోభాశెట్టి  చెప్పడం. అలాంటి ఫీలింగ్స్ మా మనసుల్లో ఉంటే.. తెలుగు వాళ్లు మిమ్మల్ని ఆదరించేవాళ్లు కాదని శివాజీ తెలిపారు. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మెచ్యూర్డ్ లేకుండా మాట్లాడొద్దని సూచించారు.

“శోభాశెట్టి ఎంకరేజ్ చేశారంటే ఆమె నటన బాగుంది కాబట్టే. తెలుగు వాళ్లు ఎప్పుడూ అలాగే  పోత్సహిస్తారు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావనేది చూడరు. నువ్వే అనవసరంగా.. నేను బయట అమ్మాయిని అని నీకు నువ్వు చెప్పుకోవడం నాకు చాలా ఛీప్ అనిపించింది. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు” అని తెలిపాడు. ఇక తన విషయంలో చాలా ఓవరాక్షన్ చేసిందని, ఎందుకు ఇలా ఈ పిల్ల జీవితాన్ని పాడుచేసుకుంటుంది అని అనిపించిందని శివాజీ తెలిపారు.

శోభాకి బిగ్ బాస్ తరువాత కూడా తన ప్రవర్తన మార్చుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడని, సహనం, ఓపిక లేకపోతే జీవితాలు నాశనం అవుతాయని తెలిపాడు. ఆమె కనీసం ఇప్పుడైనా బుద్ది మార్చుకుంటే మంచిందని చెప్పుకొచ్చారు. తెలుగు సీరియల్స్ చేస్తూ.. మళ్లీ మమ్మల్నే అనడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాను నచ్చకపోతే తెలుగు వాళ్లతో పాటు ప్రపంచం అంతా వెలివేస్తుందా? ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దని, అది ఆమెకి మంచిది కాదు.. నాకూ మంచిది కాదు అంటూ శోభాశెట్టికి శివాజీ వార్నింగ్ ఇచ్చారు. మరి.. శోభా శెట్టిపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş