విశాఖ ఆటో ప్రమాద ఘటన.. ఆ రియల్ హీరోస్‌కు పేరేంట్స్ సలాం..!

విశాఖ పట్నంలో సంగం-శరత్ థియేటర్ కూడలి వద్ద జరిగిన ఆటో-లారీ ప్రమాదంలో ఎనిమిది మంది స్కూల్ చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అందరూ చూస్తు ఉండిపోయారే కానీ.. ఆ పిల్లలను ఆసుపత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. కానీ.. ఓ ఇద్దరు..

విశాఖ పట్నంలో సంగం-శరత్ థియేటర్ కూడలి వద్ద జరిగిన ఆటో-లారీ ప్రమాదంలో ఎనిమిది మంది స్కూల్ చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అందరూ చూస్తు ఉండిపోయారే కానీ.. ఆ పిల్లలను ఆసుపత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. కానీ.. ఓ ఇద్దరు..

విశాఖ పట్నంలో స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటోను లారీ ఢీ కొట్టిన ఘటన ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శరత్ థియేటర్-సంగం జంక్షన్ వద్ద జరిగిన ఈ యాక్సిడెంట్ ధాటికి ఆటో పల్టీ కొట్టింది. అందులోని పిల్లలు ఎగిరి రోడ్డుపై పడ్డారు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారులకు బలంగా గాయాలయ్యాయి. పిల్లలు  హాహాకారాలు చేశారు.  స్థానికంగా ఉన్న వ్యక్తులు కొందరు రక్తమోతున్న చిన్నారులను ఆటో నుండి బయటకు తీస్తున్నారే తప్ప.. ఆసుపత్రికి తరలించడం లేదు. చాలా వాహనాలు ఉన్నాయి కానీ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ముందుకు రావట్లేదు. చోద్యం చూస్తూ, అయ్యో పాపం అనుకుంటూ ఉండిపోయారు కొందరు. మరికొంత మంది సెల్ ఫోన్లకు పని చెప్పారు. ఇలాంటి ప్రమాదాల్లో టైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లక ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి.

కానీ ఓ ఇద్దరు ఆ గాయపడ్డ చిన్నారులను సకాలంలో ఆసుపత్రికి తరలించి రియల్ హీరోలే కాదూ ప్రాణ దాతలు అయ్యారు. తీవ్ర గాయాలై.. శరీరం నిండా రక్తపు గాయాలతో స్పృహ కోల్పోయిన చిన్నారులను చూసి చలిపోయించాడు అటుగా కారులో వెళుతున్న వ్యక్తి. మరో వ్యక్తి బస్సులో నుండి ఈ దృశ్యాన్ని చూసి మనస్సు కకావికలం కావడంతో.. వెంటనే బస్సు దిగిపోయాడు. ఈ ఇద్దరూ కలిసి ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన చిన్నారులను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారే వెంకట్రవు. శివ. వెంకట్రావు.. స్థానికంగా ఓ హోటల్లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతడు పనిచేస్తున్న హోటల్‌కు దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగింది. పొద్దున్నే కారులో డ్యూటీకి వెళ్తున్న వెంకట్రావు.. జంక్షన్ వద్దకు రాగానే.. జనాలు గుమిగూడటం చూసి.. ఏమైందని తీక్షణంగా చూడగా.. ఆటో బోల్తా పడి ఉంది.

వెంటనే సిగ్నల్ క్రాస్ చేసి ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే రక్తమోడుతున్న చిన్నారులను చూసి చలించిపోయి.. బాగా దెబ్బలు తగిలిన నలుగురు చిన్నారుల్ని.. తన కారులో ఎక్కించుకుని సమీపంలోని సెవెన్ హిల్స్ ఆసుప్రతికి తీసుకెళ్లాడు. అక్కడ పిల్లలను అడ్మిట్ చేస్తూనే.. తన హోటల్‌కు కాల్ చేసి మరో కారును సంఘటన జరిగిన ప్రాంతానికి పంపించారు వెంకట్రావు. అక్కడ నుండి మరో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దీంతో తీవ్రంగా గాయపడిన హాసిని ప్రియ అనే చిన్నారి సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడం కారణంగా ప్రాణాలతో బయటపడింది. అలాగే శివ అనే వ్యక్తి కూడా వీరిని రక్షించడంలో కీలక పాత్ర పోషించాడు. జీవీఎంసీ ఉద్యోగి అయిన శివ.. భీమిలి వైపు వెళ్తున్నాడు. ఆర్టీసీ బస్సులో వెళుతుండగా.. ఆటో బోల్తా పడి ఉండటాన్ని చూశాడు.

వెంటనే బస్సు ఆపి.. దిగి ఏం జరిగిందా అని ప్రమాదం జరిగిన ప్రాంతానికి పరుగెత్తాడు. అప్పటికే అక్కడ కారుతో సిద్ధంగా ఉన్న వెంకట్రావుకు సహకారం అందించారు. తీవ్ర గాయాలతో హాహాకారాలు చేస్తున్న ఆ చిన్నారులను చూసి.. తమ చేతులతో ఎత్తుకుని కారులో ఎక్కించారు శివ. స్థానికుల సాయంతో ఆటోలో చిక్కుకున్న మరి కొంత మంది చిన్నారులు బయటకు తీసి.. వారిని కారులో ఎక్కించి.. సకాలంలో వైద్యం అందేలా కృషి చేశారు. సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చి.. పిల్లల ప్రాణాలు కాపడటానికి కారణమైన ఈ ఇద్దర్ని వైద్యులు అభినందించారు. తల్లిదండ్రులైతే వారి రుణం తీర్చుకోలేమని చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. వాళ్లే లేకుంటే పిల్లల పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటనే భయమేస్తుందని ఆవేదన చెందారు. మావత్వం కరువు అవుతున్న వేళ.. వీరు రియల్ హీరోలుగా మారి.. పిల్లల జీవితాలను నిలబెట్టారు. మరీ మానవ రూపంలో ఉన్న దేవుళ్లు అని అనవచ్చు.. మరీ మీరేమంటారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments