ఇతడి కష్టాలు పగోడికి కూడా రాకూడదు.. పాపం.. టిక్ టాక్ శ్రీను

ఎంత పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి.. అటు పేరుతో పాటు ఫేమ్ తెచ్చుకున్న టిక్ టాక్ శ్రీనుకు ఇలాంటి కష్టమే వచ్చింది. కానీ అతడు తీసుకున్న నిర్ణయం మాత్రం..

ఎంత పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి.. అటు పేరుతో పాటు ఫేమ్ తెచ్చుకున్న టిక్ టాక్ శ్రీనుకు ఇలాంటి కష్టమే వచ్చింది. కానీ అతడు తీసుకున్న నిర్ణయం మాత్రం..

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అవుతూనే ఉన్నారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారి.. ఫేమ్‌తో పాటు నేమ్ సంపాదిస్తున్నారు. టిక్ టాక్ (ప్రస్తుతం ఇండియాలో బ్యాన్), స్నాప్ చాట్, యూట్యూబ్, ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఒక్క వీడియోతో ట్రెండింగ్‌లో నిలుస్తూ.. ఓవర్ నైట్ స్టార్ హోదాను పొందుతున్నారు. అయితే ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపే.. విషాదం నెలకొంటే..ఇదిగో ఈ ఫేమస్ టిక్ టాకర్ విషయంలో అదే జరిగింది. కుటుంబం మొత్తం కళ్ల ముందే కానరాని లోకాలకు తరలి వెళ్లిపోతున్నారు. దీంతో ఒంటరి తనం భరింలేక అతడూ ప్రాణాలు వదిలాడు. ఆ వ్యక్తి పేరు యడవల్లి శ్రీనివాస్

టిక్ టాక్ వీడియోలతో టిక్ టాక్ శ్రీనుగా గుర్తింపు పొందాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇతడు.. ఒంటరి తనం భరించలేక కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై నుండి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ సగ్గొండ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే సమయంలో ఒకప్పుడు యావత్ ప్రపంచాన్ని వీడియోలతో ఊపు ఊపేసిన టిక్ టాక్ పై దృష్టి సారించాడు. అతడు వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అలా టిక్ టాక్ ద్వారా డబ్బులు, పేరు సంపాదించాడు. జీవితం సాఫీగా సాగిపోతుందని ఆనందించే లోపు.. ఇద్దరు పిల్లల్ని కొన్ని రోజుల తేడాతో కోల్పోయాడు శ్రీను.

ఇద్దరు పాము కాటుతోనే చనిపోవడంతో.. కన్నీరు మున్నీరు అయ్యారు తల్లిదండ్రులు. అయినప్పటికి ఓ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అంతలో మరో విషాదం.. పిల్లలు చనిపోయారన్న దిగులు పడి.. అనారోగ్యం తెచ్చుకుని భార్య మరణించింది. ఇటు తండ్రి కూడా చనిపోవడంతో..ఒంటరి అయిపోయాడు. నలుగురి మరణాలు అతడ్ని కోలుకోకుండా చేశాయి. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు వెంటాడాయి. తల్లి, దత్తత కుమార్తెతో జీవనం సాగిస్తున్నాడు. కానీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై బైక్ పార్క్ చేసి ఒక్కసారిగా గోదాట్లోకి దూకేశాడు. అక్కడే ఉన్న పడవ కార్మికులు గమనించి.. టిక్ టాక్ శ్రీనును నది నుండి సమీప ఘాట్ వద్దకు తీసుకు వచ్చారు. అయితే అప్పటికే మృతి చెందాడు శ్రీను. మృతుడి మేనల్లుడు పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Show comments