P Krishna
Road Accident: బంగారం లాంటి భర్త, అందమైన పిల్లలు, అమెరికాలో మంచి ఉద్యోగం. ఎంతో హ్యాపీగా గడిచిపోతున్న ఆమె జీవితంలో అగాధం ఏర్పడింది.
Road Accident: బంగారం లాంటి భర్త, అందమైన పిల్లలు, అమెరికాలో మంచి ఉద్యోగం. ఎంతో హ్యాపీగా గడిచిపోతున్న ఆమె జీవితంలో అగాధం ఏర్పడింది.
P Krishna
ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.. వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. అతి వేగం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎంతో అందమైన జీవితం.. అమెరికాలో మంచి ఉద్యోగం.. కానీ విధి చిన్నచూపు చూసింది. రెండు రోజుల వ్యవధిలో ఏపి కి చెందిన మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు ప్రమాదవశాత్తు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోర్ట్ ల్యాండ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావుతో పోరాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన మహిళ కమతం గీతాంజలి (32) కన్నుమూసింది. ప్రమాదంలో గాయపడిన వెంటనే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కన్నుమూసింది. కూతురు పుట్టిన రోజు సందర్భంగా భర్త, కొడుకు ఆరేళ్ల కూతురుతో కలిసి గుడికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి హానిక అక్కడిక్కడే చనిపోయింది. కొణకంచి గ్రామానికి చెందిన కమతం నరేష్-గీతాంజలి దంపతులు పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం.. కొడుకు నరేశ్, కూతురు హానిక. తమ కూతురు పుట్టిన రోజు కావడంతో ఎంతో సంతోషంగా గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని కారులో బయలుదేరారు. పోర్ట్ ల్యాడ్ ప్రాంతంలో మృత్యువు వారిని వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో హానిక అక్కడిక్కడే చనిపోగా, గీతాంజలి సోమవారం చనిపోయింది. రెండు రోజుల వ్యవధిలోనే తల్లీకూతురు చనిపోయారు. కమతం నరేష్, కొడుకు బ్రమణ్ కు గాయాలు కావడంతో చికిత్స తీసుకుంటున్నారు. గీతాంజలి, హానిక మృతదేహాలను స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుననట్లు బంధువులు తెలిపారు.. ఈ విషయంలో ప్రభుత్వం తమకు సాయం చేయాల్సిందిగా కోరుతు. తల్లీకూతురు చపిపోవడంతో కొణకంచి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.