జనసేన లాంటి పార్టీలను చాలానే చూశాం: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చాలా వాడీవేడీగా సాగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ  మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో మధ్యలో జనసేన కూడా నేనున్నాను అంటూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ తరువాత  రాజకీయ యుద్ధం  పతకా స్థాయికి చేరుకుంది.  జనసేన అధినేత పవన్ కల్యాణ్  పరోక్షంగా టీడీపీ అధ్యక్షుడిలా మారిపోయాడని టాక్ వినిపిస్తోంది. అందుకే వారాహి యాత్రలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచక పడుతున్నాడు. ప్రతిపక్షాల కౌంటర్లకు వైసీపీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పవన్ పై ఫైర్ అయ్యారు. రాష్ట్రా ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేశారు.

శుక్రవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. “చంద్రబాబు అవినీతి, అక్రమాల పుట్ట. చంద్రబాబు తరపు న్యాయవాదులు 17ఏ ప్రకారం అరెస్ట్ చేయడం చట్ట విరుద్దమంటున్నారు. రాష్ట్ర ఖజాను  దొచుకున్న దొంగ చంద్రబాబు. అలాంటి ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ అనుమతి తీసుకోలేదని కేసు కొట్టేయమనడం సిగ్గు చేటు. సెక్షన్ 17 ఏ రాక ముందే  ఈ స్కాంపై కేసు నమోదైంది. చంద్రబాబు 2004లో సీఎంగా దిగిపోయే సరికి కమీషన్లకు కక్కుర్తి పడే వాడు. టీడీపీ, జనసేన ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు వైసీపీకే పట్టం కడతారు. టీడీపీ గరిటెలు, పళ్లాలు కొట్టిన ప్రజలు క్షమించరు. టీడీపీ,  జనసేన కూటమికి 25 సీట్లు రావొచ్చు. అలానే పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు లోపలు ఉంటే ఏమిటి, బయట ఉంటే ఏంటి, ఎవరికి పనికోస్తాడు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ పై కూడా కొడాలి నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదని సెటైర్లు వేశారు. పవన్ బీజేపీతో కలిసి ఉన్నా.. వారితో ఎన్నికలకు వెళ్తునాని పవన్ చెప్పడం లేదని,  వైఎస్సార్ సీపీ .. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా భయపడేది లేదని అన్నారు. ఎన్నికల్లో పోటీ డిపాజిట్లు కూడా రాని పవన్ రెచ్చిపోతున్నాడని, జనసేన వంటి పార్టీలు చాలా వచ్చాయని, అలాంటి అడ్రెస్ కూడా లేకుండా పోయాయని కొడాలి నాని అన్నారు.  అరిచే కుక్క కరవదు..కరిచే కుక్కు మొరగదు అంటూ కొడాలి నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చే వరకూ పవన్ కొవ్వొత్తులు పట్టుకుని తిరమనండి. మాకేం నష్టంలేందటూ కొడాలి నాని ఘాటూ వ్యాఖ్యలు చేశారు.

Show comments