iDreamPost

సీఎం జగన్‌ను ఎమ్మెల్యే టికెట్ కోరిన TDP అభ్యర్థి!

సీఎం జగన్‌ను ఎమ్మెల్యే టికెట్ కోరిన TDP అభ్యర్థి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానం చూసి ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి.. ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలే కాకుండా.. రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేపట్టారు సీఎం జగన్. అందుకే 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే కొందరు టీడీపీ  ఎమ్మెల్యే అభ్యర్థులు  సీఎం జగన్ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఓ టీడీపీ అభ్యర్థి అయితే ఏకంగా సీఎం జగన్ ను కలిసి టికెట్ కోరినట్లు టాక్ వినిపిస్తోంది.

ఏపీలోని అనకాపల్లి జిల్లా పరిధిలోని పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇది ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం. ఇక్కడి ఓటర్లు తరచూ విభిన్న తీర్పు ఇస్తూ అభ్యర్థులకు షాకిస్తుంటారు. ఈ నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ తరపున గొల్లబాబురావు భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బి. బంగారయ్యను ఓడించారు. దీంతో బంగారయ్యను టీడీపీ పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక 2014లో ఇక్కడి నుంచి వంగలపూడి అనిత.. టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.

2019లో ఆమె కొవ్వురూ నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో తిరిగి పాయకరావు పేట నుంచి పోటీ చేయాలని భావిస్తుంది. టీడీపీ అధిష్టానం కూడా అనిత వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 2019 పోటీ చేసి ఓడిపోయిన బంగారయ్యకు ఈసారి టీడీపీ మొండిచేయే చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక్కసారి అవకాశంతో భంగపడి రాజకీయాల కోసం బంగారం లాంటి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బంగారయ్య ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడే జగన్ ను కలిసి తన మనసులో మాటను డాక్టర్ బంగారయ్య చెప్పినట్లు తెలుస్తోంది.

2024లో వైసీపీ తరపున టికెట్ ఇస్తే తాను పాయకరావు పేట నుంచి పోటీకి సిద్ధమని ఆయన సీఎం జగన్ విజ్ఞప్తి చేసినట్లు పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ఇదే సమయంలో అనిత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై పొత్తు పార్టీ జనసేనలో వ్యతిరేకత ఉన్న నేపథ్యం నుంచి చూస్తే వైసీపీ కొత్త ముఖాన్ని తెచ్చి పెట్టాలని భావిస్తోందని సమచారం. వైసీపీ మదిలో ఏముందో తెలియదు కానీ బంగారయ్య ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల నాటి పాయకరావుపేట రాజకీయ పరిస్థితి చూడాలి. మరి.. సీఎం జగన్ ను టీడీపీ అభ్యర్థి టికెట్ కోరినట్లు సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి