వీడియో: ఆకతాయికి దేహశుద్ధి.. విద్యార్థిని ధైర్యానికి శభాష్ అనాల్సిందే!

Machilipatnam: దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధులను కట్టడి చేయలేకపోతున్నారు.

Machilipatnam: దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధులను కట్టడి చేయలేకపోతున్నారు.

ఇటీవల దేశ వ్యాప్తంగా ఒంటరిగా ఉన్న మహిళలపై కొంతమంది ఆకతాయిలు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. దారుణం ఏంటంటే కొంతమంది దుర్మార్గులు తమ గుట్టు బయటపడుతుందని అత్యాచారం చేసి హత్యలకు పాల్పపడుతున్నారు. ఈ దారుణాలు పెద్దవాళ్లే కాదు.. మైనర్లు కూడా చేస్తున్నారు. ఇటీవల ఏపిలో మైనర్లు ఓ మైనర్ ని అత్యాచారం చేసి హత్యచేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చిన్నా పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. కొద్ది రోజులగా లైంగికంగా వేధిస్తున్న యువకుడిని ఓ విద్యార్థిని రోడ్డుపై బుద్ది చెప్పింది.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

దేశంలో మహిళలపై అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లు కనిపిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా రెచ్చిపోతున్నారు. రోడ్డు పై ఒంటరిగా మహిళలు నడవాలంటే భయపడే పరిస్థితికి చేరుకుంది. ఎన్ని చట్టాలు వచ్చినా పోలీసులు నిత్యం జరుగుతున్న అత్యాచారాలను అరికట్టలేపోతున్నారు. ప్రతిరోజూ ఎన్నో కేసులు ఫైల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ విద్యార్థినిని ముగ్గురు ఆకతాయిలు వెంటపడి వేధిస్తున్నారు. ఈ విషయం ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఆ ముగ్గురి కోసం గాలిస్తున్న సమయంలో అందులో ఒక యువకుడు దొరికాడు. అంతే ఆ విద్యార్థిని ఆమె కుటుంబ సభ్యులు బడితె పూజ చేశారు. ఈ ఘటన మచిలీపట్నంలో జరిగినట్లు తెలుస్తుంది.

మచిలీపట్నంలో మూడు రోజులుగా ఓ విద్యార్థిని వేధిస్తున్న ఆకతాయికి విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులు దేహశుద్ది చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాగా దెబ్బలు తిన్న ఆ పోకిరి ‘సారీ అక్కా’ అంటూ బ్రతిమలాడాడు. ‘నడువు పోలీస్ స్టేషన్’ కి నడువు అంటూ పోకిరిని స్టేషన్ కి తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించారు. ఆ యువతి చేసిన దైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు చూసైనా అమ్మాయిలు ధైర్యం తెచ్చుకోవాలి.. పోకిరీల అంతు చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తు.. ఆ విద్యార్థిని మెచ్చుకుంటున్నారు.

Show comments