iDreamPost

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 5,348 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు

  • Published Jun 07, 2024 | 4:04 PMUpdated Jun 07, 2024 | 4:04 PM

ప్రభుత్వ​ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతంది. ఆ వివరాలు..

ప్రభుత్వ​ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతంది. ఆ వివరాలు..

  • Published Jun 07, 2024 | 4:04 PMUpdated Jun 07, 2024 | 4:04 PM
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 5,348 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు

నేడు మన భారతీయ సమాజంలో నెలకొని ఉన్న అతి పెద్ద సమస్యల్లో నిరుద్యోగం ప్రధానమైంది. ప్రతి ఏటా డిగ్రీలు పాస్‌ అయ్యి బయటకు వచ్చే యువత లక్షల్లో ఉంటే.. వారి కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్లలో ఉద్యోగాలు వేల సంఖ్యలోనే ఉంటున్నాయి. దాంతో చాలా మందికి ఉద్యోగాలు దొరకడం లేదు. ఇక మన దేశ యువతకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగ భద్రత, సమాజంలో గవర్నమెంట్‌ ఉద్యోగికి లభించే గౌరవ, మర్యాదలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే తమ ఆశయంగా పెట్టుకుంటారు. అందుకు ఏళ్ల తరబడి శ్రమిస్తూ.. నిద్రాహారాలు మాని మరి.. పరీక్షల కోసం ప్రిపేరవుతుంటారు. తెలంగాణలో కూడా ప్రభుత్వ ఉద్యోగార్థులు లక్షల్లో ఉన్నారు. ఈ క్రమంలో వారికి రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కార్‌.. 2024, డిసెంబర్‌లోగా రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ హామీ అమలు కోసం కృషి చేస్తోంది. ముందుగా టీఎస్‌పీఎస్‌ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసింది. అలానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని తెలిపింది. ఇవన్ని ఇప్పటికే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే 5,348 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో 5,348 పోస్టులు భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఉద్యోగాల భర్తీకై ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పిటికే ఆదిశగా కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ నియామకాల ప్రక్రియ వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో డాక్టర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ఏఎన్‌ఎం పోస్టులున్నాయి. వీటి భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన క్రమంలో.. వాటిలో బోధనా సిబ్బందిని నియమించేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. ఈలోపే ఎన్నికల కోడ్‌ రావడంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది.

ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఇలా అన్నీ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో పోస్టుల్లో 1,988 మంది స్టాఫ్‌ నర్సులు, 1,014 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, 764 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 596 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తదితర పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవలు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి