iDreamPost

మహిళలకు వడ్డీ లేని రుణాలు.. సొంతంగా ఎదిగేందుకు ఆర్థిక సహకారం!

Good News To Women: ఇప్పటికే మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ లేని రుణాలను అందజేయాలని.. ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్లాన్ చేస్తుంది.

Good News To Women: ఇప్పటికే మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ లేని రుణాలను అందజేయాలని.. ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్లాన్ చేస్తుంది.

మహిళలకు వడ్డీ లేని రుణాలు.. సొంతంగా ఎదిగేందుకు ఆర్థిక సహకారం!

మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శక్తి పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది స్వయం సహాయక బృందాల సభ్యులకు మరిన్ని బాధ్యతలు అప్పగించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 1050 మీసేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల అవసరం తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అయితే ఈ కేంద్రాలను మహిళా సంఘాలకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. రానున్న ఐదేళ్ళలో మహిళా సంఘాల సంఖ్యను 64 లక్షల నుంచి కోటి వరకూ పెంచాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకునేలా మహిళలను ప్రోత్సహించడం, ఆర్థిక ఎదుగుదలకు సహకరించడం, సామాజిక భద్రత కోణంలో మహిళా సంఘాలను బలోపేతం చేయడమే మహిళా శక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ని స్త్రీ నిధి, సెర్ఫ్ అధికారులు సిద్ధం రూపొందిస్తున్నారు.

మూడు రంగాలుగా చేయూత:

మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రొడక్షన్, ట్రేడింగ్, సర్వీసెస్ ఇలా మూడు రంగాలుగా విభజించారు. ప్రొడక్షన్ రంగంలో పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లు, పాడి పశువులు, ఫిషరీస్, హస్తకళలు, చేనేత వస్త్ర తయారీ, యూనిఫార్మ్ లు కుట్టడం వంటివి వస్తాయి. ఇటీవల ప్రభుత్వం విద్యార్థుల యూనిఫార్మ్ లు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఈ బాధ్యతలను మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ట్రేడింగ్ విభాగంలో మినీ సూపర్ మార్కెట్లు, జనరిక్ మెడికల్ షాప్స్, మినీ సోలార్ యూనిట్లు, విత్తనాలు, ఎరువుల షాప్స్ వంటి వాటిని మహిళా సంఘాల కోసం ఏర్పాటు చేయనున్నారు. సర్వీసెస్ లో భాగంగా ఆధార్, మీ సేవ కేంద్రాలను అప్పగించనున్నారు. 

లక్ష కోట్ల రుణాలు:

వచ్చే ఐదేళ్ళలో మహిళా సంఘాలకు బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా లక్ష కోట్ల రుణాలను అందించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. చిన్న పరిశ్రమలు, వ్యాపారం పెట్టుకునే మహిళలకు 25 వేల కోట్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ డబ్బులో ఏటా 5 వేల గ్రామ సంఘాలకు కోటి రూపాయల చొప్పున 5 వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వనున్నారు. అలానే ఎటువంటి వడ్డీ లేకుండా బ్యాంకు లోన్లను మంజారు చేయనున్నారు. మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ వంటి వెబ్ సైట్స్ లో ఉంచడం, ట్రేడ్ ఎగ్జిబిషన్స్ లో పాల్గొనేలా ప్రోత్సహించడం వంటివి అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.   

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి