Krishna Kowshik
Pavithra Gowda Makeup Controversy రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రగౌడకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. అయితే విచారణ నిమిత్తం ఈ నెల 15న ఆమెను తన ఇంటికి తీసుకెళ్లగా ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లో దర్శనమిచ్చింది. ఇది వివాదమైంది.
Pavithra Gowda Makeup Controversy రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రగౌడకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. అయితే విచారణ నిమిత్తం ఈ నెల 15న ఆమెను తన ఇంటికి తీసుకెళ్లగా ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లో దర్శనమిచ్చింది. ఇది వివాదమైంది.
Krishna Kowshik
ప్రియురాలి కోసం రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో కన్నడ అభిమాన హీరో, ముద్దుగా పిలుచుకునే డీబాస్ జైలుకెళ్లిన సంగతి విదితమే. ప్రియురాలు పవిత్రగౌడతో పాటు 17 మందికి జ్యూడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులోని పరప్పన జైలులో సేదతీరుతున్నారు. పవిత్రగౌడకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడన్న కారణంతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి.. అత్యంత ఘోరంగా కొట్టి చంపారు దర్శన్ అండ్ టీం. ఈ కేసును విచారిస్తున్నారు బెంగళూరు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఈ నెల 15న దర్యాప్తులో భాగంగా నిందితురాలైన పవిత్ర గౌడ, పవన్‌లను వారి ఇంటికి తీసుకెళ్లారు. ఆమెను రాజేశ్వరి నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లగా..బయటకు వచ్చినప్పుడు పవిత్ర ముఖాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు జనాలు.
ఆమె ఫుల్ మేకప్ వేసి, లిప్ స్టిక్ పూయడంతో హాట్ టాపిక్ అయ్యింది. అలాగే ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయం ఇప్పుడు రచ్చ రచ్చ అయ్యి.. ఈ వివాదం పోలీసుల మెడకు చుట్టుకుంది. ఓ నిందితురాలి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఆమె మేకప్ వేసుకునేందుకు టైం ఇచ్చిన పోలీసులపై విమర్శలు తలెత్తాయి. దీంతో ఓ మహిళ పోలీసుకు నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నేత్రావతికి పశ్చిమ డివిజన్ డీసీపీ గిరీష్ నోటీసులు జారీ చేశారు. కాగా, దీనిపై ఆమె మేకప్ వేసుకునేందుకు తాము అనుమతించలేది, డ్రెస్ ఛేంజ్ చేసుకునేందుకు వాష్ రూంకి వెళ్లిందని, అప్పుడే మేకప్ వేసుకుందని తెలిపినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. జూన్ 15న విచారణ నిమిత్తం పవిత్ర గౌడను ఆమె ఇంటికి తీసుకురాగా, కించిత్ పశ్చాత్తాపం కూడా కనిపించలేదని స్థానికులు భావిస్తున్నారు. ఆమెలో అహం మాత్రమే కనిపించిందని అభిప్రాయ పడ్డారు. ఆమె ముఖంలో చిరునవ్వు, వేషధారణ చూసి తిట్టిపోస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడలకు జులై 4 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిచింది. ఈ నేపథ్యంలో దర్శన్ ను కలిసేందుకు భార్య విజయలక్ష్మీ, కొడుకు రాగా, పవిత్ర గౌడను కలిసేందుకు ఆమె కూతురు ఖుషీ వచ్చింది. అలాగే జైలులో పవిత్ర గొంతెమ్మ కోరికలు కోరుతుందని కూడా తెలుస్తుంది. ఇంటి నుండి భోజనం ఇవ్వాలని, దుప్పటి తెప్పించాలంటూ డిమాండ్స్ చేస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.