iDreamPost

జోస్ అలుక్కాస్ లో భారీ చోరీ.. కిలోల కొద్ది బంగారం లూటీ!

ప్రముఖ నగల షాపు అయిన తాజాగా జోస్ అలుక్కాస్ లో భారీ చోరీ జరిగింది. కిలోల కొద్ది బంగారం లూటీ కావడంతో యాజమన్యం పాక్ కు గురవుతున్నారు.

ప్రముఖ నగల షాపు అయిన తాజాగా జోస్ అలుక్కాస్ లో భారీ చోరీ జరిగింది. కిలోల కొద్ది బంగారం లూటీ కావడంతో యాజమన్యం పాక్ కు గురవుతున్నారు.

జోస్ అలుక్కాస్ లో భారీ చోరీ.. కిలోల కొద్ది బంగారం లూటీ!

ఈ మధ్యకాలంలో కొందర వ్యక్తులు ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నారు. చెమట చిందించి సంపాదించకుండా ఉన్న చోటే డబ్బును కూడబెట్టాలను అనుకుంటున్నారు. ఇందు కోసం ఆ దొంగలు ఎన్నో మార్గాలను వెతుక్కుంటున్నారు. సాంకేతిక యుగం కొత్త పుంతలు తొక్కడంతో ఇప్పుడు అంతా సైబర్ నేరాలకు పాల్పుడుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు. కానీ, తాజాగా తమిళనాడులో ఓ దుండగుడు ఏకంగా ఓ ప్రముఖ నగల షాపు అయిన జోస్ అలుక్కాస్ లో భారీ చోరీకి పాల్పడ్డాడు. నగలు మిస్స్ అయినట్లుగా అనుమానం రావడంతో షాపు సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు కోయంబత్తురులోని గాంధీనగర్ లో ప్రముఖ నగల షాపు జోస్ అలుక్కాస్ ను గతంలోప్రారంభించారు. అయితే, ఈ నగల షాపులో తాజాగా ఓ యువకుడు చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 25 కిలోల బంగారు అభరణాలను దొంగతనం చేశారు. కాగా, లెక్కల్లో ఎక్కడో తేడా రావడంతో సిబ్బంది పై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే మరోసారి పరిశీలించారు. ఇక నిజంగానే చోరీ జరిగిందని గుర్తించారు. వెంటనే కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నగల షాపులో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే, ఇందులో మంగళవారం అర్థరాత్రి 2.30 నిమిషాల సమయంలో ఓ యువకుడు మాస్క్ ధరించి ఆ నగల షాపులోకి అడుగు పెట్టాడు.

ఆ తర్వాత దాదాపు 25 కిలోల బంగారు అభరణాలు చోరీ చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజీ లో స్పష్టంగా కనిపించాయి. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ చోరీ ఘటనలో నిందితుడు ఒక్కడే ఉన్నట్లుగా తెలుస్తుందని, త్వరలో చోరీ చేసిన నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. అయితే, చోరీ చేసిన బంగారు నగల విలువ దాదాపు కోట్లల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఉన్నట్టుండి ఈ షాపులో భారీ ఎత్తున చోరీ జరగడంతో యాజమన్యం షాక్ కు గురైంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అర్థరాత్రి 25 కిలోల బంగారు అభరణాలు దొంగిలించిన ఇతగాడి చోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి