Krishna Kowshik
Crime News.. భర్తను కాదని పిల్లలతో సహా పుట్టింటికి వచ్చేసింది. మళ్లీ చదువుకుంటాను అంటే తల్లి ప్రోత్సహించింది. 12వ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇంట్లో నుండి బయలు దేరింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. అలాగే..
Crime News.. భర్తను కాదని పిల్లలతో సహా పుట్టింటికి వచ్చేసింది. మళ్లీ చదువుకుంటాను అంటే తల్లి ప్రోత్సహించింది. 12వ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇంట్లో నుండి బయలు దేరింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. అలాగే..
Krishna Kowshik
వివాహేతర సంబంధాలు, సహజీవనం ఈ మధ్య కాలంలో ప్రతి కుటుంబాన్ని ఛిన్నా భిన్నం చేస్తున్నాయి. విచ్చలవిడితనం, అనైతికత పెరిగిపోవడం కలహాల కాపురానికి కారణమౌతున్నాయి. అదేమంటే కోర్టులు, చట్టాలు అంటూ కాకర కాయ కబుర్లు చెబుతున్నారు. కట్టుకున్న జీవిత భాగస్వామిని కాదని మరొకరితో కామ వాంఛల్లో మునిగి తేలుతున్నారు. ఈ బంధాల కారణంగా తమ చేతులతో తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఓ హృదయ విదాకరకమైన ఘటన వెలుగు చూసింది. భర్తను కాదని పుట్టింటికి చేరిన మహిళ.. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడి వల్ల తల్లైంది. ఈ విషయం ప్రియుడికి తెలిసి అబార్షన్ చేయించుకోవాలని సూచించాడు.
ప్రేమికుడి మాటలు నమ్మి.. నవీ ముంబయి ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంటుంగా మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని తన స్నేహితుడి సాయంతో నదిలో పడేశాడు ప్రియుడు. తల్లి మృతదేహాన్ని నదిలో పడేయం చూసి ఏడుస్తున్న 5, 2 ఏళ్ల పిల్లల్ని కూడా నీటిలో పడేశాడు. అయితే తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్ అయ్యారని ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగు చూసింది. విస్తుపోయే ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మావల్‌లోని తలేగావ్ దభాడే సమీపంలోని ఇండోరిలో సమ్రీన్ నిసార్ అనే మహిళ తన పిల్లలైన ఇషాంత్, ఇజాన్లతో తన పుట్టింట్లో నివసిస్తుంది. ఆమె కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో గజేంద్ర జగన్నాథ్ దగద్ ఖైరె అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
దీని వల్ల ఆమె గర్భవతి అయ్యింది. అయితే అబార్షన్ చేయించుకోవాలని సూచించడంతో ఈ నెల 5న తల్లికి 12వ తరగతి పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళుతున్నానని చెప్పింది. అక్కడకు వెళ్లి ఓ మెడికల్ అసిస్టెంట్ రవికాంత్ అనే వ్యక్తిని సంప్రదించాలని చెప్పగా.. నమ్మి వెళ్లింది. కానీ అబార్షన్ చేస్తుండగా మహిళ మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకున్న గజేంద్ర, రవికాంత్ సాయంతో ఇండోరిలోని ఇంద్రాయణి నదిలో పారేశాడు. అక్కడే ఉన్న పిల్లలు ఏడ్వడంతో వారిని కూడా నదిలో పడేశారు. కూతురు ఫోన్ చేయకపోవడంతో పాటు ఇంటికి తిరిగి రాక రెండు రోజులు ముగిసిపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టగా.. సమ్రీన్, గజేంద్ర రిలేషన్ బయటకు వచ్చింది. ఈ కమ్రంలో అతడ్ని పట్టుకుని విచారించగా.. అసలు నిజం తెలిసింది. రవికాంత్ తో పాటు గజేంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోర్టు ముందు హాజరు పర్చగా జులై 30 వరకు పోలీసు కస్టడీకి తరలించింది.