ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. అందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పార్టీ గుర్తుపై జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను రెండు దఫాలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. రాష్టంలో 660 మండలాలు ఉండగా మొదటి దఫాలో 333 మండలాలకు రెండో విడతలో మిగిలిన 327 మండలాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రణాళకలు సిద్ధం […]