ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తెలంగాణలోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్, ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని గగన్ విహర్ సీబీఐ కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. బందోబస్త్కు సంబంధించి ఏపీ పోలీసుల నుండి తెలంగాణ పోలీసులకు లేఖ అందింది. తనపై ఉన్న అక్రమాస్తులకేసులో ప్రతీ శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్నా జగన్ సీఎం […]
ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని వైఎస్ విజయమ్మ, షర్మిలకు కోర్టు నోటీసు జారీ చేసింది. ఈనెల 10న హాజరుకావాలని కోర్టు నోటీసు ఇచ్చింది. వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసింది. అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లో పరకాల పీఎస్లో కేసు నమోదైంది.