యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి కలిసొచ్చినట్లు లేదు. అందినట్లే అంది చేజారిపోతూ ఉంటుంది. తాజా పరిస్థితులు పదవీకాలం పూర్తయ్యేంతవరకు కూర్చిలో కూర్చోనిచ్చేలా కనిపించడం లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. న్యాయస్థానాల్లో ఆయనకు ప్రతికూల తీర్పులు వెలువడుతుండడంతో ముఖ్యమంత్రి మార్పు తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. కాగా… యడ్యూరప్ప మాత్రం వచ్చే రెండేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. […]
కర్ణాటకలో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బెంగళూరు వాసులను గురువారం హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా? లేదా మరోసారి లాక్డౌన్ విధించమంటారా? అని ప్రజలపై ఆసహనం వ్యక్తం చేశారు. తిరిగి లాక్డౌన్ విధించకుండా ఉండాలంటే తప్పసరిగా భౌతిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. కరోనా నివారణ చర్యలపై చర్చించేందుకు అధికారులతో యడ్యూరప్ప సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా […]
దేశంలోని పలు రాష్ట్రాలను తన బాటలో నడిచేలా చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూసుకుపోతున్నారు. దేశంలో ఏ నాయకుడూ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని వినూత్న ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ చేస్తున్న కార్యక్రమాలను విపక్షాలు విమర్శిస్తుంటే.. పక్క రాష్ట్రాలు మాత్రం జగన్ ముందుచూపును అనుసరిస్తున్నాయి. తాజాగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కూడా పరిపాలన వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించింది. బెంగుళూరు నుంచి తొమ్మిది కీలక కార్యాలయాలను ఇతర ప్రాంతాలను తరలించాలని […]
https://youtu.be/