తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థి ఎవరన్న అంశంపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కరోనా వైరస్‌తో అకాల మరణం పొందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుందన్న ఊహాగానాల మధ్య ఇటీవల టీడీపీ తన అభ్యర్ధిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మీ పేరును ప్రకటించింది. వైసీపీ అభ్యర్ధిగా ఎవరుంటారనే అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో నిన్న గురువారం వైసీపీ అధినేత […]