ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శాసన సభ్యుల కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఆరు స్థానాల్లో ఇద్దరు పాత వారినే ఎంపిక చేయగా మరో నాలుగురు కొత్తవారికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్థానం కల్పించారు. ఆరుగురిలో ఒక మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అనంతపురం జిల్లా హిందూపురం […]