ప్రభుత్వాన్ని నడపడంతో ఇప్పటికే సరికొత్త అధ్యాయాలను రచించిన సీఎం వైఎస్ జగన్.. పార్టీని నడపడంలోనూ తనదైన మార్క్‌ను వేస్తున్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత సాధారణంగానే పదవులు ఆశించిన వారిలో, వారి అనుచరుల్లో అసంతృప్తి ఉండడం సర్వసాధారణం. ఆయా అసంతృప్తులను చల్లార్చడంతోపాటు వారి సేవలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవడంలో సీఎం జగన్‌ది అందవేసిన చేయిగా చెప్పవచ్చు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగిన వారం రోజులకే.. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లుగా సీనియర్ నేతలను, మంత్రి […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో.. అందుకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం జగన్ నడుంబిగించారు. ఈ నెల 11వ తేదీన నూతన కేబినెట్‌ను ఏర్పాటు చేసిన జగన్.. వారం రోజుల్లోనే వరుసగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించిన సీఎం జగన్.. ఆ వెంటనే పార్టీ జిల్లా అధ్యక్షులను, రీజనల్ కో ఆర్డినేటర్లను ప్రకటించారు. […]