హైస్కూల్ రోజుల్లో జీవనతరంగాలు సీరియల్ వచ్చేది. వీక్లీలకి బాగా డిమాండ్ ఉన్న కాలం. అన్ని బడ్డి కొట్లలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రిక వీక్లీలు వేలాడుతున్న పీక్ పిరియడ్. మా ఫ్రెండ్ వాళ్ల అక్కయ్య ఆ సీరియల్ చదివి కూచోపెట్ట కథ చెప్పేది. చదివే అలవాటు లేని ఆడవాళ్లు శ్రద్ధగా వినేవాళ్లు. అప్పటికి పిల్లల పుస్తకాలు తప్ప కథలు, నవలలు అలవాటు లేదు. యద్దనపూడి వినిపిస్తూ ఉండడంతో రాయదుర్గం లైబ్రరీలో నల్లులతో కుట్టించుకుంటూ ఈ సీరియల్ చదివాను. ఆసక్తిగా […]