జగన్ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించింది. జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. ఆవేశంలో చేసిన వివిధ నేరాల నుంచి తప్పు తెలుసుకుని పరివర్తన పొందిన మహిళా ఖైదీలకు విముక్తి లభించింది. ఏపీలోని వివిధ సెంట్రల్ జైళ్ల నుంచి 53 మంది విడుదలయ్యారు. జైలు సంస్కరణలలో భాగంగా పలు అంశాల్లో శిక్షణ పొందిన ఖైదీలు బయట ప్రపంచంలోకి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అనుగుణంగా తలుపులు తెరిచింది. విశాఖ, రాజమహేంద్రవరం, నెల్లూరు సెంట్రల్ జైళ్ల నుంచి మహిళా ఖైదీలు బయటకు […]
కవితకు కాదేది అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ.. తమ రాజకీయానికి కాదేది అనర్హం అనేలా సాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష టీడీపీ రాజకీయ వ్యవహారం. వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా, విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించినా.. ఇలా ఏదైనా సరే రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ఖైదీల విడుదలను కూడా టీడీపీ నేతలు తమ రాజకీయానికి వాడుకుంటున్న వైనమేఅందరిని విస్మయపరుస్తోంది. […]