కరోనా సంఘానికే కాదు సినిమా పరిశ్రమకూ బోలెడు పాఠాలు నేర్పించేసింది. ఇకపై ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించే బడ్జెట్లు ఉండకపోవచ్చు. స్టార్ల రెమ్యునరేషన్లకు కోతలు పడవచ్చు. విదేశాల్లో నడిచే కథలకు గుడ్ బై చెప్పొచ్చు. ఔట్ డోర్ షూటింగులు వద్దనే డిమాండ్లు పెరగొచ్చు. ఇంకా చాలా చాలానే మార్పులు చూడబోతోంది పరిశ్రమ. ముఖ్యంగా కొత్త టాలెంట్ కు దారులు తెరవబోతున్నారు. నిర్మాతల ఇళ్ళు, ప్రొడక్షన్ హౌసుల ఆఫీసుల చుట్టూ తిరిగే యాతన న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ […]
రాబోయే రోజుల్లో ఓటిటి ప్రభావం దాని వల్ల కలగబోయే మార్పుల గురించి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి ఆదరణ పెరుగుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా వెబ్ సిరీస్ లు సినిమాలను తలదన్నే కంటెంట్ తో రూపొందుతుండటంతో స్టార్లు సైతం వీటి వైపు చూస్తున్నారు. ఇప్పటికే జగపతిబాబు, నవదీప్, వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు ట్రయల్స్ కూడా వేశారు. కొన్ని వర్కవుట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి అంతే. ముందు ముందు మరికొందరు దీని వైపు సీరియస్ గా […]
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. చిరంజీవితో గతంలో ఉన్న విభేదాల దృష్ట్యా నిజంగా ఇది సాధ్యమవుతుందా అనే అనుమానాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ టాక్ రావడానికి కారణం ఉంది. గతంలో పలాస ప్రమోషన్స్ లో అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఆ దర్శకుడు కరుణ కుమార్ తో ఓ చిత్రం చేస్తానని పబ్లిక్ గానే చెప్పేశారు. దీంతో […]
ఈ కొత్తపోరడు వెబ్ సీరీస్ మీద నాకెందుకో చిన్న చూపు ఉండేది. దీన్ని ఇంత ఆలస్యంగా చూడటానికి గల కారణం… ఆ చిన్నచూపే. అందుకే ఇది రిలీజైన టైం లో ఫస్ట్ ఎపిసోడ్ ఒక పది నిమిషాలు చూసి చిరాకొచ్చి ఆపేశా. కారణం…అందులో ఉండే తెలంగాణా యాస & బూతులు. “అబ్బ …ప్రతీవోడు ఈ తెలంగాణా యాసను పట్టుకోవడం,నాలుగు బూతు మాటలు పెట్టడం దాన్నే వెబ్ సీరీస్ అనడం కామనయిపోయింది” అనుకున్నా…..రెండు మూడు బూతులు కూడా మనసులో […]
ఈ హెడ్డింగ్ కొంత అసంబద్ధంగా అనిపించినా కరోనా లాక్ డౌన్ వల్ల స్టార్ డైరెక్టర్లు సైతం వెబ్ సిరీస్ లవైపు చూస్తున్న వేళ రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. అందులోనూ సినిమాలకు ధీటుగా వాటిలో కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు సైతం మంచి ఆదరణ కలిగిస్తున్నారు. కొన్ని టీవీ ఛానల్స్ ఏకంగా వీటినే రోజు వారి అరగంట ఎపిసోడ్లుగా ప్రసారం చేయడానికి పూనుకున్నాయి. ఇంకొద్ది రోజుల్లో సినిమా షూటింగులు మొదలుకాబోతున్నాయి కాబట్టి నిజంగా […]
గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా మహర్షి రూపంలో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తన కొత్త సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రిన్సే ఇంకో ఛాన్స్ ఇస్తాడని వేచి చూస్తే తీరా ఆ ఆఫర్ కాస్తా పరశురాం కొట్టేశాడు. సర్కారు వారి పాట పేరుతో రూపొందుతున్న ఈ మూవీ తాలుకు అనౌన్స్ మెంట్ కూడా నిన్న వచ్చేసింది. నిజానికి వంశీ పైడిపల్లి కథ పూర్తిగా నచ్చకపోవడం వల్లే మహేష్ […]
ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ తో పాటు లక్ కలిసివచ్చినప్పుడే ఎక్కువ గుర్తింపు వస్తుంది. అది లేని నాడు మనం పడ్డ కష్టం వల్ల వచ్చే ఫలితం తక్కువే. దీనికి ఉదాహరణగా నవదీప్ ని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంన్నర దాటినా విజయాల శాతం తక్కువగా ఉండటంతో హీరో కన్నా ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నవదీప్ చాలా రోజుల క్రితమే వెబ్ సిరీస్ ల వైపు వచ్చేశాడు. ఈ క్రమంలో […]
లాక్ డౌన్ రూపంలో కరోనా తెచ్చిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. సినిమా టీవీ అనే భేదం లేకుండా మొత్తం స్థంబించిపోయాయి. సీరియల్స్ షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో రేటింగ్స్ తో పాటు యాడ్స్ తగ్గిపోయి ఛానల్స్ లబోదిబోమంటున్నాయి. వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ప్రేక్షకులకు ఒకరకమైన విసుగు తెప్పించారనే చెప్పాలి. ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మీద అవగాహన లేని కామన్ ఆడియెన్స్ వాటినే చూస్తూ రిపీట్ రన్స్ కు […]
ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ వెబ్ సిరీస్ కు రాని హైప్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన పాతాళ్ లోక్ దక్కించుకుంది . ట్రైలర్ నుంచే అంచనాలు పెంచేసిన దీని మీద ఇప్పటికే ఆన్ లైన్ తో పాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. సినిమా మేకింగ్ ని తలదన్నే క్వాలిటీతో, కంటెంట్ తో రూపొందుతున్న ఇలాంటి సిరీస్ ల మీద ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ క్రైమ్ బ్యాక్ డ్రాప్ […]
ఆచార్య షూటింగ్ కు లాక్ డౌన్ వల్ల బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు సిసిసి పనులతో పాటు లూసిఫర్ రీమేక్ తాలూకు స్క్రిప్ట్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి చిరు త్వరలో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందంటూ దాని కోసం ఆహా ప్లాట్ ఫార్మ్ ఏర్పాట్లు చేస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. నిజానికి ఈ స్టేజిలో […]