iDreamPost
android-app
ios-app

పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న పుష్ప 2.. రాష్ట్రానికో వ్యూహం

  • Published Nov 30, 2024 | 4:54 PM Updated Updated Nov 30, 2024 | 4:54 PM

Pushpa 2 Updates : పుష్ప మ్యానియాతో దేశం అంతా ఊగిపోతున్న సంగతి తెలిసిందే. అటు బడ్జెట్ లో కూడా ఎక్కడ వెనక్కు తగ్గలేదు. టాలీవుడ్ తో పాటు ప్రపంచం అంతా ఈ వైబ్ కనిపిస్తుంది. అందుకే పుష్ప సినిమాను ప్రతి చోట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి పుష్ప మేకర్స్ భారీ ప్లానింగ్ చేస్తున్నారు . దానికోసం వేసిన తొలి అడుగే ఈవెంట్స్. అందుకే అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.

Pushpa 2 Updates : పుష్ప మ్యానియాతో దేశం అంతా ఊగిపోతున్న సంగతి తెలిసిందే. అటు బడ్జెట్ లో కూడా ఎక్కడ వెనక్కు తగ్గలేదు. టాలీవుడ్ తో పాటు ప్రపంచం అంతా ఈ వైబ్ కనిపిస్తుంది. అందుకే పుష్ప సినిమాను ప్రతి చోట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి పుష్ప మేకర్స్ భారీ ప్లానింగ్ చేస్తున్నారు . దానికోసం వేసిన తొలి అడుగే ఈవెంట్స్. అందుకే అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.

  • Published Nov 30, 2024 | 4:54 PMUpdated Nov 30, 2024 | 4:54 PM
పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న పుష్ప 2.. రాష్ట్రానికో వ్యూహం

పుష్ప మ్యానియాతో దేశం అంతా ఊగిపోతున్న సంగతి తెలిసిందే. అటు బడ్జెట్ లో కూడా ఎక్కడ వెనక్కు తగ్గలేదు. టాలీవుడ్ తో పాటు ప్రపంచం అంతా ఈ వైబ్ కనిపిస్తుంది. అందుకే పుష్ప సినిమాను ప్రతి చోట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి పుష్ప మేకర్స్ భారీ ప్లానింగ్ చేస్తున్నారు . దానికోసం వేసిన తొలి అడుగే ఈవెంట్స్. అందుకే అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. నిజానికి తమిళ నాట టాలీవుడ్ సినిమా గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పడు పుష్ప సినిమా ప్రీ రిలీజ్ తోనే బిజినెస్ జరుగుతుందని.. పెట్టిన మొత్తం చాలా త్వరగా వస్తుందని జ్ఞానవేల్ రాజా అన్నారు. అంత పేరున్న ప్రొడ్యూసర్ ఈ రేంజ్ లో సినిమాను పొగిడేసరికి ..తమిళనాట విపరీతమైన హైప్ పెరిగిపోయింది. అటు నార్త్ లో కూడా పుష్ప బొమ్మ ఎక్కువ థియేటర్స్ లో పడే ఛాన్స్ ఉంది. అక్కడ చాలా గట్టి వారికే డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇచ్చారు. సో అక్కడ కూడా భారీ రేంజ్ లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

కర్ణాటకలో కూడా స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ రైట్స్ ను ఇచ్చారు. దీనితో ఇప్పటివరకు కన్నడలో ఏ సినిమాకు లేనంతగా పుష్ప 2 ను అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళ్తుంది పుష్ప 2. సో దీనితో ఎక్కడ కూడా థియేటర్స్ కు కొదవ లేదు. పైగా ఎక్కడా కూడా ఈ సినిమాకు పోటీగా మరే సినిమా రిలీజ్ కు రెడీ గా లేదు. ఈ సినిమా వస్తుందన్న ఆలోచనతో పోస్ట్ పోన్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. సో ఎక్కువ రోజులు థియేటర్స్ ను హోల్డ్ చేసే కెపాసిటీ పుష్ప 2 కు ఉంది. అందుకే పుష్ప బిజినెస్ 1000 కోట్లకు మించి జరిగిందన్న టాక్ నడుస్తుంది. ఇంత వరకు బన్నీ సినిమాలకు జరిగిన బిజినెస్ తో కంపేర్ చేస్తే.. పుష్ప కు ఓ రేంజ్ లో జరిగిందని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమాలో ఉన్న  పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనే డైలాగ్ .. ఇప్పుడు సినిమా మీద క్రియేట్ అవుతున్న బజ్ కు సరిగ్గా సూట్ అవుతుంది.

బాహుబలి నార్త్ మార్కెట్ ను కొట్టే వరకు మనకు అక్కడ అంత రేంజ్ ఉందని తెలీదు. ఇప్పుడు ఆ నెంబర్ ను దాటడడానికి.. దాని దగ్గరలోకి వెళ్ళడానికి  పుష్ప2 కి   స్కోప్ ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల స్ట్రాటజీని ఫాలో అయితే మాత్రం టార్గెట్ ఈజీగా క్రాక్ చేయొచ్చని ట్రేడ్ పండితుల అంచనా. ఈ లెక్కన పుష్ప 2 తెలుగు సినిమా మార్కెట్ ను ఓ రేంజ్ లో మార్చేలా కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటివరకు ఏ సినిమా మీద లేని విధంగా పుష్ప 2 మీద ఆశలు ,అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ .. రిలీజ్ తర్వాత కూడా వినిపిస్తే చాలని బన్నీ అభిమానాలు ఆశగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్ కోసం కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.