iDreamPost
android-app
ios-app

తెలంగాణాలో పుష్ప కి బిగ్గెస్ట్ ప్రాఫిట్.. టికెట్ ధరలు ఎంతంటే ?

  • Published Nov 30, 2024 | 5:11 PM Updated Updated Nov 30, 2024 | 5:11 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని ఎంత ఎదురుచూస్తున్నారో. టికెట్స్ ధరలు ఎలా ఉంటాయా అని కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ పుష్ప 2 పై వరాల జల్లు కురిపించిందని చెప్పి తీరాలి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని ఎంత ఎదురుచూస్తున్నారో. టికెట్స్ ధరలు ఎలా ఉంటాయా అని కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ పుష్ప 2 పై వరాల జల్లు కురిపించిందని చెప్పి తీరాలి.

  • Published Nov 30, 2024 | 5:11 PMUpdated Nov 30, 2024 | 5:11 PM
తెలంగాణాలో పుష్ప కి బిగ్గెస్ట్ ప్రాఫిట్.. టికెట్ ధరలు ఎంతంటే ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని ఎంత ఎదురుచూస్తున్నారో. టికెట్స్ ధరలు ఎలా ఉంటాయా అని కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మొన్నటివరకు ఓ టాక్ నడిచింది. అలానే అవన్నీ రూమర్స్ అంటూ కూడా మరో టాక్ నడిచింది. దీనితో అసలు టికెట్ ధరలు ఎలా ఉంటాయా.. పెరిగితే ఎంత ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ పుష్ప 2 పై వరాల జల్లు కురిపించిందని చెప్పి తీరాలి. డిసెంబర్ 5 న సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో ఓ రోజు ముందే అంటే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు తొలి బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంటకు రెండో షో పడనుంది. వీటి టికెట్ ధరలు సింగల్ స్క్రీన్ కు రూ.1121 , మల్టీప్లెక్స్ కు రూ.1239 గా కేటాయించింది.

ఇక ఆ తర్వాత మొదటి నాలుగు రోజులు అంటే డిసెంబర్ 5 నుంచి 8 వరకు.. సింగల్ స్క్రీన్ కు రూ.354 , మల్టిప్లెక్స్ కు రూ.531.. అలాగే డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.300, మల్టీఫ్లెక్స్‌లో రూ. 472.. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.200 , మల్టీఫ్లెక్స్‌ రూ.354 గా టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టికెట్ ధరలపై రకరకాల మీమ్స్ మొదలయ్యాయి. వాస్తవానికి సామాన్యులకు ఈ ధరలు ఎక్కువగానే అనిపిస్తాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. . సో వారికి టికెట్ ధరల కంటే కూడా సినిమా చూడడమే ముఖ్యం అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మొదటి వారం రోజులు కూడా ఫ్యాన్స్ తోనే థియేటర్ నిండిపోతుంది. ఇక ఆ తర్వాత మెల్లగా మూవీ లవర్స్ అంత క్యూ కడతారు.   మరో విధంగా టికెట్ ధరలు పెంచడం అనేది పుష్ప 2 మేకర్స్ కు బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు పెంచిన ధరలను బట్టి ఈజీగా మొదటి వారంలోనే పుష్ప 2 అనుకున్న రికార్డ్స్ ను అందుకునే ఛాన్స్ ఉంది.

ఇదే విధంగా ఏపీ లో కూడా పెంచితే మాత్రం.. కచ్చితంగా ఈ సినిమా రెండు వారాలలో తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ టికెట్ ధరల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. పుష్ప 2 ఇంకొక్క ఈవెంట్ ను ఫినిష్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి అది కూడా కంప్లీట్ అయిన తర్వాత.. బుకింగ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఏ సినిమాకు లేని విధంగా ఈ సినిమా టికెట్ ధరలను పెంచారు. ఇక పెరిగిన ఈ టికెట్ ధరలతో పుష్ప ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.