iDreamPost
android-app
ios-app

Mohan Babu : కలెక్షన్ కింగ్ చిన్నితెర దర్శనం ఇస్తారా

  • Published Oct 21, 2021 | 5:12 AM Updated Updated Oct 21, 2021 | 5:12 AM
Mohan Babu : కలెక్షన్ కింగ్ చిన్నితెర దర్శనం ఇస్తారా

ఇటీవలి కాలంలో మన స్టార్లు థియేటర్లలో ఆడే సినిమాలు మాత్రమే చేస్తామని గిరి గీసుకోకుండా మెల్లగా వెబ్ సిరీస్ ల వైపు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ వరకు చూసుకుంటే ఈ విషయంలో విక్టరీ వెంకటేష్ మొదటి అడుగు ఆల్రెడీ వేసేశారు. రానాతో కలిసి చేస్తున్న రానా నాయుడు ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. వేగంగానే చేయబోతున్నారు. నాగార్జున సైతం స్క్రిప్ట్ లు పరిశీలిస్తున్న విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఇక బాలకృష్ణ తన ఫస్ట్ స్టెప్ ఆహాలో టాక్ షో చేయడం ద్వారా మొదలుపెట్టారు. దీపావళి నుంచి ఇది స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే మరో సీనియర్ స్టార్ కూడా రంగంలోకి దిగుతారట.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఆహా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఓ తమిళ రచయిత అందించిన కథ ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని మంచు ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఒకటే పెండింగ్ అని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే మంచు లక్ష్మి అందులో ఒక కుకరీ షో చేసింది కాబట్టి ఒప్పించడం మరీ కష్టమేమి కాదు. సినిమాల పరంగా చూసుకుంటే మోహన్ బాబు మార్కెట్ ఏనాడో తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సన్ అఫ్ ఇండియా మీద కూడా ఏమంత హైప్ లేదు. కమర్షియల్ ఫార్మాట్ లో చేసిన టీజర్ కట్, ఇళయరాజా సంగీతం లాంటివి అంతగా ప్రభావం చూపించడం లేదు.

ముందు ముందు ప్రమోషన్ల ద్వారా ఏమైనా బజ్ తీసుకొస్తారేమో చూడాలి. సో ఈ లెక్కన చూసుకుంటే మోహన్ బాబు నిజంగా ఇలా వెబ్ సిరీస్ ల వైపు వస్తే మంచి నిర్ణయమే అవుతుంది. ఆహా సైతం టాక్ షోలు, వెబ్ సిరీస్ లతో గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఒకపక్క సినిమాల ఓటిటి హక్కుల కోసం వెచ్చిస్తూనే మరోవైపు కొత్త తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమంతాతో చేసిన షోకు ఆశించిన స్పందన రాకపోయినా కూడా అందులో జరిగిన పొరపాట్లు సవరించుకుంటూ ఇప్పుడు యాంకర్ ప్రదీప్ తో కూడా ఒక గేమ్ షో స్టార్ట్ చేస్తోంది. థియేటర్ కు టీవీకు ధీటుగా ఓటిటిలో ఈ స్థాయిలో విప్లవం రావడం మాత్రం కొరోనా పుణ్యమే. ఇంకేం మార్పులు రాబోతున్నాయో

Also Read : Sooryavanshi : ఆశలన్నీ ఈ మల్టీ స్టారర్ మీదనే

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişcasinoroyalmeritbet