Vinay Kola
Pushpa 2: పుష్ప 2 కి దేశవ్యాప్తంగా మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. దాంతో టికెట్ రేట్లు కూడా ఓ రేంజిలో ఉన్నాయి.
Pushpa 2: పుష్ప 2 కి దేశవ్యాప్తంగా మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. దాంతో టికెట్ రేట్లు కూడా ఓ రేంజిలో ఉన్నాయి.
Vinay Kola
ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ మామూలుగా లేదనే చెప్పాలి. పాన్ ఇండియా వైడ్ గా షేక్ ఆడిస్తుంది. అయితే టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు నైజాం ఏరియాలో పర్మిషన్స్ బాగానే వచ్చాయి. ఏపీలో కూడా మంచి హైక్ కి పర్మిషన్స్ వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో టికెట్ ప్రైజెస్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీంతో పుష్ప 2 సినిమా తెలుగులో రికార్డులు సృష్టించడం పక్కా. అఫ్కోర్స్ .. అల్లు అర్జున్ పెద్ద స్టార్ హీరో కావడంతో తెలుగు రాష్ట్రాలలో రికార్డ్స్ చాలా న్యాచురల్. కానీ తెలుగు రాష్ట్రాల్లో మించి ముంబైలో పుష్ప క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. అక్కడ మైసన్ PVR, జియో వరల్డ్ డ్రైవ్ లో టికెట్ల రేట్లు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజిలో ఉన్నాయి. ఇంతకీ అక్కడ టికెట్ రేట్ ఎంతో తెలుసా?
అక్షరాలా 3 వేల రూపాయలు. అవును, అక్కడ స్పెషల్ స్క్రీన్స్ లో ఏకంగా రూ.3000 వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి మన తెలుగు సినిమా మూంబై లాంటి ఇంటర్నేషనల్ సిటీలో హాలీవుడ్ మూవీస్ లెవెల్ లో ట్రెండ్ అవుతుందని క్లారిటీగా తెలుస్తుంది. ముంబైలో సూపర్ అప్డెటెడ్ టెక్నాలజీతో రన్ అయ్యే మల్టీప్లెక్స్ లు మైసన్ PVR, జియో వరల్డ్ డ్రైవ్. అలాంటి మల్టీ ప్లెక్స్ లో సినిమా అంటే మినిమమ్ హాలీవుడ్ రేంజిలో ట్రెండ్ అవ్వాలి. దీంతో పుష్ప 2 కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ఈ ఎగ్జాంపుల్ తో ఈజీగా క్లారిటీ వచ్చేసింది. ఇక పుష్ప 2 కామన్ టికెట్ ధర కూడా ఏమంత తక్కువ కాదు. ఏకంగా రూ.700 ఉంది.
బాలీవుడ్‌కి చెందిన పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు మాత్రమే చాలా రేర్ గా ఆ స్క్రీన్‌లో స్క్రీనింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పుష్ప 2 క్రేజ్ కి ముంబై కూడా షేక్ అవుతుంది. అందుకే అంత టికెట్ ప్రైజ్ ఉన్న స్క్రీన్ లో సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ కొన్ని టికెట్లు సేల్ అయ్యాయి. ఇక రిలీజ్ డేట్ నాటికి టికెట్ రేట్లు ఫుల్ గా సేల్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి పుష్ప 2 సినిమా రేంజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా టోటల్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యిందని చెప్పడానికి ఇదో లైవ్ ఎగ్జాంపుల్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇది కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఎన్టైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకే గొప్ప విషయం. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.