iDreamPost
android-app
ios-app

బుచ్చి బాబు భారీ ప్లానింగ్.. స్టార్ సెలెబ్రిటీలనే దించుతున్నాడుగా

  • Published Nov 30, 2024 | 4:56 PM Updated Updated Nov 30, 2024 | 4:56 PM

RC17 Update: బుచ్చి బాబు.. ఈ దర్శకుడు ఒక్క సినిమాతో టాలీవుడ్ కు పెద్ద షాకే ఇచ్చాడు. హీరో హీరోయిన్ ఇద్దరు ఇండస్ట్రీకి కొత్తే అయినా సరే ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించాడు . ఓ దర్శకుడిలో మంచి పనితనం ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తూ ఉంటాయి

RC17 Update: బుచ్చి బాబు.. ఈ దర్శకుడు ఒక్క సినిమాతో టాలీవుడ్ కు పెద్ద షాకే ఇచ్చాడు. హీరో హీరోయిన్ ఇద్దరు ఇండస్ట్రీకి కొత్తే అయినా సరే ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించాడు . ఓ దర్శకుడిలో మంచి పనితనం ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తూ ఉంటాయి

  • Published Nov 30, 2024 | 4:56 PMUpdated Nov 30, 2024 | 4:56 PM
బుచ్చి బాబు భారీ ప్లానింగ్.. స్టార్ సెలెబ్రిటీలనే దించుతున్నాడుగా

బుచ్చి బాబు.. ఈ దర్శకుడు ఒక్క సినిమాతో టాలీవుడ్ కు పెద్ద షాకే ఇచ్చాడు. హీరో హీరోయిన్ ఇద్దరు ఇండస్ట్రీకి కొత్తే అయినా సరే ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించాడు . ఓ దర్శకుడిలో మంచి పనితనం ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తూ ఉంటాయి. దీనితో చాలా మంది హడావిడిగా ఏ ఛాన్స్ వస్తే దానిని ఒప్పేసుకుని సినిమా తీస్తూ ఉంటారు. కానీ బుచ్చి బాబు మాత్రం కాస్త ఆలస్యమైన సరే.. ఓ పెద్ద స్టార్ తో సినిమా తీయాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు.

ముందు ఎన్టీఆర్ తో సినిమా తీద్దాం అని అనుకుంటాడట ఈ దర్శకుడు. కానీ కొన్ని కారణాల వలన అది జరగలేదు. అటు ఎన్టీఆర్ కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దింతో వెంటనే గ్లోబల్ స్టార్ ను లైన్ లో పెట్టేశాడు బుచ్చి బాబు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ గేమ్ చెంజర్ ఆలస్యం కావడంతో ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంత టైం పట్టింది. మొన్నటివరకు ఈ సినిమాలో హీరో హీరోయిన్ తప్ప ఇంకెవరి డీటెయిల్స్ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని స్టార్స్ గురించి టాక్ బయటకు వస్తుంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా మీర్జాపూర్ సిరీస్ లోని మున్నా భాయ్ క్యారెక్టర్ తో ఫేమస్ అయిన దివ్యేందు.. బుచ్చి బాబు సినిమాలో కీ రోల్ లో నటిస్తున్నట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ సౌండ్ చేస్తుంది. దివ్యేందు నెగిటివ్ క్యారెక్టర్స్ కు బాగా సూట్ అవుతాడు కాబట్టి.. బహుశా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో అతను నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని.. ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక దానికంటే ముందే జగపతిబాబును కూడా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గా తీసుకున్నట్లు అనౌన్స్ చేశాడు బుచ్చి బాబు. మరో వైపు ఆయనే మెయిన్ విలన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని టాక్.

సో మొత్తానికి బుచ్చి బాబు ఈసారి ఇంకాస్త పకడ్బందీగా సినిమాను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ హిట్ కొడితే.. బుచ్చి బాబు పై ఇంకాస్త ప్రెజర్ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆ సక్సెస్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు క్యాస్టింగ్ సెలక్షన్ చేస్తున్నాడెమో అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది పక్కా మాస్ సినిమా అని.. చరణ్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే సినిమా అని టాక్ నడుస్తుంది. ఇక బుచ్చి బాబు ఎలా ప్లాన్ చేశాడో చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş