యంగ్ హీరో శ్రీ విష్ణు నుంచి మరో మూవీ రిలీజ్ అయింది. అదే #సింగిల్. ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూసేద్దాం.
యంగ్ హీరో శ్రీ విష్ణు నుంచి మరో మూవీ రిలీజ్ అయింది. అదే #సింగిల్. ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూసేద్దాం.
Swetha
డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాటిని సక్సెస్ చేసే హీరోలలో శ్రీవిష్ణు కూడా ఒకరు. మార్కెట్ లో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. సమజవరాగమన , ఓం భీం బుష్ లాంటి సినిమాలతో సక్సెస్ బాటలో ఉన్నాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు #సింగిల్ తో విష్ణు ఖాతాలో మరో హిట్ పడిందంటున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూసేద్దాం.
కథ:
బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా సింగిల్ గానే ఉండిపోతాడు విజయ్(శ్రీవిష్ణు). తన స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్)తో సింగిల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. అయితే కొన్నాళ్ళకు అనుకోకుండా ఆడి షోరూం లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేసే పూర్వ (కేతిక శర్మ) తో ప్రేమలో పడతాడు. కానీ మరోవైపు విజయ్ ను హరిణి(ఇవాన) లవ్ చేస్తుంది. కథ అంత కూడా ఈ ముగ్గురి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మరి ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ గెలిచింది ! వీరికి ఎదురైనా ఇబ్బందులు ఏంటి ? విజయ్ ఎవరితో కలిసి జీవిస్తాడు ? చివరికి విజయ్, పూర్వ కలిశారా? లేక విజయ్, హరిణి కలిశారా? అసలు విజయ్ మింగిల్ అవుతాడా సింగిల్ గానే మిగిలిపోతాడా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా అందరిని సరదాగా నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ఎప్పటిలానే అందరిని అలరిస్తుంది. హీరో తో పాటు ఇద్దరు హీరోయిన్స్ కూడా తమ క్యారెక్టర్స్ కు పూర్తిగా న్యాయం చేశారు. ఇక మెయిన్ లీడ్స్ తో పాటు వెన్నెల కిషోర్ కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్న సీన్స్ అన్ని కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక వీరితో పాటు రాజేంద్ర ప్రసాద్ అతిధి పాత్రలో కాస్త సెంటిమెంట్ పండిస్తారు. ఇలా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారని చెప్పి తీరాల్సిందే.
సాంకేతికవర్గం పనితీరు:
నిజానికి ఈ సినిమా అంతా కూడా శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ తోనే ముందుకు నడిచిందని చెప్పి తీరాలి. తమిళంలో వెటరన్ మూవీ సినిమాటోగ్రాఫర్ గా పేర్కొనే వేల్ రాజ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. కానీ ఆ స్థాయి మేకింగ్ స్టైల్ ఈ మూవీల్లో కనిపించలేదని అంటున్నారు వీక్షకులు. కానీ ప్రొడక్షన్ , ఆర్ట్ వర్క్ విషయంలో మాత్రం మూవీ టీం ఎక్కడా రాజి పడలేదు. ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం మూవీకి మంచి ప్లస్ అయింది. కానీ దర్శకుడు కార్తీక్ రాజ్ కథను పెద్దగా పట్టించుకోలేదని టాక్ నడుస్తుంది. శ్రీ విష్ణు , వెన్నెల కిషోర్ కామెడీతోనే సినిమా అంతా సాగిపోయింది. వీటితో పాటు కథ మీద కూడా కాన్సెంట్రేట్ చేస్తే ఇంకా బావుండేదని అంటున్నారు మూవీ లవర్స్.
విశ్లేషణ:
ఇది ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరికి ఓ క్లారిటీ వచ్చింది. కొన్ని సినిమాలలో లాజిక్స్ వెతకకుండా చివరి వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఈ #సింగిల్ కూడా అదే కోవకు చెడుతుంది. కానీ ఎన్ని వన్ లైనర్స్ కామిడి పంచ్ లు ఉన్నా సరే.. వాటికి ఎండ్ లో ప్రోపర్ జస్టిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీ విషయంలో కూడా అదే జరిగింది. సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉన్నా సరే.. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని టాక్ నడుస్తుంది. ఇవేమి పట్టించుకోకుండ శ్రీ విష్ణు కామెడీ పంచ్ లను ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం.. హ్యాపీగా ఈ సినిమా చూసేయొచ్చు
ప్లస్ లు:
శ్రీ విష్ణు
వెన్నెల కిషోర్
లెక్కలేనన్ని సింగిల్ లైనర్స్
మైనస్ లు:
ప్రోపర్ జస్టిఫికేషన్ లేకపోవడం
కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే
రేటింగ్ : 2.75/5
చివరిగా : #సింగిల్ చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు