iDreamPost
android-app
ios-app

సామ్ శుభం ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్

  • Published May 08, 2025 | 5:06 PM Updated Updated May 08, 2025 | 5:06 PM

శుభం మూవీ ప్రీమియర్స్ కు మంచి బజ్ లభిస్తుందనే టాక్ వినిపిస్తుంది. అసలు ఈ మూవీ ప్రీమియర్ విషయాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

శుభం మూవీ ప్రీమియర్స్ కు మంచి బజ్ లభిస్తుందనే టాక్ వినిపిస్తుంది. అసలు ఈ మూవీ ప్రీమియర్ విషయాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

  • Published May 08, 2025 | 5:06 PMUpdated May 08, 2025 | 5:06 PM
సామ్ శుభం ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సామ్ శుభం తో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9 న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో సామ్ హుక్ స్టెప్స్ వైరల్ అవుతున్నాయి. ఇక కొద్దీ రోజుల నుంచి ఈ మూవీ ప్రీమియర్ షోస్ ను ప్రదర్శిస్తున్నారు మూవీ టీం. ప్రీమియర్స్ నుంచి వస్తున్న టాక్ ను బట్టి చూస్తుంటే మూవీ హిట్ అయ్యేలా ఉందని అంటున్నారు కొందరు.

ప్రీమియర్ టాక్ విషయానికొస్తే.. ట్రైలర్ లో చూపించినట్టు కాస్త నవ్వులు కాస్త భయ పెట్టె సన్నివేశాలతో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇక వీటితో పాటు మూవీలో చాలా డెప్త్ ఉందని అంటున్నారు. దర్శకుడు ఓ మంచి పాయింట్ నే పట్టాడు అని కూడా చెప్తున్నారు. ఇక మూవీ లవర్స్ ను ఈ కథ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే అటు ఇటుగా సినిమా ప్రీమియర్స్ కు మంచి మార్కులే పడుతున్నాయి. ఇక మే 9 న కానీ అసలు రిజల్ట్ ఏంటో తెలీదు. అయితే ఈ సమ్మర్ లో ఇంట్రెస్టింగ్ సినిమాల జాబితా ఎలాగూ తక్కువే ఉంది కాబట్టి.. దాదాపు సామ్ సినిమాకు హౌస్ ఫుల్ అవ్వడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇక శుభం సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్‌ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్‌ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సామ్ నిర్మిస్తున్న మొదటి తెలుగు చిత్రం కాబట్టి బహుశా కలెక్షన్స్ బాగానే ఉండొచ్చని అంచనా. ఇక ఏమౌతుందో చూడాలి.మరోవైపు సామ్ తెలుగు సినిమాల్లో నటించి చాలా కాలమే అయింది.ఎప్పుడెప్పుడు సామ్ ను తెరపై చూద్దామా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దానికి సంబందించిన విషయాలపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఒకవేళ అనుకున్నట్టుగా శుభం మూవీ కనుక హిట్ అయితే ప్రొడ్యూసర్ గా సామ్ మొదటి స్టెప్ సక్సెస్ అయినట్టే. మరి ఈ మూవీ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.