Swetha
ఈ వారం OTT లో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ మలయాళ సినిమాలకు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్ ఉందొ తెలియనిది కాదు. ఈ క్రమంలో ఫహద్ ఫాజిల్ నటించిని ఇరుల్ అనే మూవీ.. తెలుగులో అపరాధి అనే పేరుతో స్ట్రీమింగ్ కానుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.
ఈ వారం OTT లో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ మలయాళ సినిమాలకు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్ ఉందొ తెలియనిది కాదు. ఈ క్రమంలో ఫహద్ ఫాజిల్ నటించిని ఇరుల్ అనే మూవీ.. తెలుగులో అపరాధి అనే పేరుతో స్ట్రీమింగ్ కానుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.
Swetha
మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాల తెలుగు డబ్బింగ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్కోసారి OTT లో నేరుగా వచ్చే తెలుగు సినిమాలకంటే కూడా.. మలయాళ డబ్బింగ్ సినిమాలే ట్రెండ్ లో దూసుకుపోతూ ఉంటాయి. అలాగే ఈ వారం OTT లోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయింది. అదే ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్,దర్శన రాజేంద్రన్ నటించిన ఇరుల్ మూవీ.. తెలుగులో అపరాధి అనే టైటిల్‌తో ఓటీటీ రిలీజ్ అయింది.
ఈ సినిమా ఓ హారర్ థ్రిల్లర్ మిస్టరీ . కాగా ఈ సినిమాకు నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించారు. అసలు విషయం ఏంటంటే ఈ సినిమా రన్ టైం కేవలం గంటన్నర మాత్రమేనట . సో ఈజీగా ఈ సినిమాను అంతా చూసేయొచ్చు. అందులోను హర్రర్ సినిమా అంటే ఎవరు మాత్రం చూడకుండ ఉంటారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇరుల్ అంటే తెలుగులో చీకటి అని అర్ధం. అలెక్స్ ఒక బిజినెస్ మ్యాన్ అయిన పుస్తకరచయిత. తన లవర్ అర్చనతో కలిసి వీకెండ్ ఓ టూర్ ప్లాన్ చేస్తాడు. అది కూడా సెల్‌ఫోన్స్ లేకుండా.అక్కడ మార్గమధ్యలో కారు బ్రేక్ డౌన్ అవడంతో పక్కన ఉన్న ఓ బిల్డింగ్‌లోకి వెళ్తారు. ఆ ఇంట్లో టెలీఫోన్స్ ఏవి పనిచేయవని ఇంటి ఓనర్ చెబుతాడు. తర్వాత అలెక్స్ రాసిన క్రైమ్ థ్రిల్లర్ బుక్ ఇరుల్‌పై సెటైరికల్ కామెంట్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందనేదే అపరాధి కథ.
సినిమా స్టోరీ లైన్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే ఈ సినిమా మలయాళ వెర్షన్ ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో మాత్రం ఈరోజు నుంచి ఆహ ప్లాట్ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. డ్జ్-ఆఫ్-ది-సీట్ ఎక్స్ పీరియన్స్ చేయాలంటే ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.