iDreamPost
android-app
ios-app

సమంతా హన్సిక కొత్త రూటు

  • Published Jun 22, 2020 | 10:10 AM Updated Updated Jun 22, 2020 | 10:10 AM
  • Published Jun 22, 2020 | 10:10 AMUpdated Jun 22, 2020 | 10:10 AM
సమంతా హన్సిక కొత్త రూటు

రాబోయే రోజుల్లో ఓటిటి ప్రభావం దాని వల్ల కలగబోయే మార్పుల గురించి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి ఆదరణ పెరుగుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా వెబ్ సిరీస్ లు సినిమాలను తలదన్నే కంటెంట్ తో రూపొందుతుండటంతో స్టార్లు సైతం వీటి వైపు చూస్తున్నారు. ఇప్పటికే జగపతిబాబు, నవదీప్, వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు ట్రయల్స్ కూడా వేశారు. కొన్ని వర్కవుట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి అంతే. ముందు ముందు మరికొందరు దీని వైపు సీరియస్ గా దృష్టి పెట్టే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సమంత అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ది ఫ్యామిలీ మెన్ సీక్వెల్ లో కీలక పాత్ర చేస్తోంది.

మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి హుషారొచ్చిన దర్శక ద్వయం రాజ్- డికెలు రెట్టించిన ఉత్సాహంతో కొత్త కంటెంట్ ని షూట్ చేస్తున్నారు. లాక్ డౌన్ రాకపోయి ఉంటే ఈపాటికి పూర్తయ్యేది కానీ ఇప్పుడు మాత్రం ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. ఈ సిరీస్ లో సమంతా కొంత నెగటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టుగా టాక్. ఇదిలా ఉండగా యాపిల్ బ్యూటీ హన్సిక కూడా వెబ్ సిరీస్ చేస్తోంది. భాగమతి దర్శకుడు అశోక్ రూపొందిస్తున్న ఎపిసోడ్స్ లో ఇప్పటికే కొంత భాగం పూర్తయ్యాయి. మహిళల మీద జరుగుతున్న దురాగతాలను ఆధారంగా చేసుకుని ఒక డిఫరెంట్ పాయింట్ తో అశోక్ దీన్ని రూపొందిస్తున్నారట. ఈమెను తప్ప ఇంకెవరిని ఊహించలేనంత గొప్పగా హన్సిక చేస్తోందని అశోక్ కితాబులు ఇస్తున్నారు.

ఇది కూడా ప్రైమ్ నిర్మాణంలోనే జరుగుతోంది. టైటిల్ డిసైడ్ చేయని ఈ సిరీస్ హిట్ అయితే హన్సిక సీరియస్ గా ఫోకస్ పెట్టొచ్చు. ఇప్పటికే ప్రియమణి, పూర్ణ, అక్షర హాసన్ లాంటి వాళ్ళు వీటిని చేసేసి మరికొన్ని అవకాశాలను ఒడిసిపట్టుకుంటున్నారు. వెబ్ సిరీస్ లకు సినిమాలాగా హిట్టు ఫ్లాప్ లాంటి రిస్క్ ఉండదు. దానికి తోడు లెంత్ ఎక్కువగా ఉన్న సిరీస్ కాబట్టి రెమ్యునరేషన్ కూడా బాగానే ముడుతుంది . ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గినా ఓటిటి రంగం మాత్రం హీరొయిన్లకు రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కం చెబుతోంది. రాబోయే రోజుల్లో మీడియం రేంజ్ హీరోలు కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఎలాగూ మొదలుపెట్టాడు. ఇక సౌత్ లో ఎవరెవరు వస్తారో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet