గ్రామ స్వరాజ్యానికి గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వచనంగా మారాయి. ప్రజలకు తమ ఊరిలోనే ప్రభుత్వ సేవలు అందించాలన్న మహాత్మా గాంధీ కలలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు ప్రజలకు ఉన్నతమైన, సత్వర సేవలను అందిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున లాంఛనంగా ప్రారంభమైన సచివాలయ వ్యవస్థ ఏడాది కాలంలోనే కోటి వినతులను పరిష్కరించి సరికొత్త రికార్డును సృష్టించాయి. గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభమైనది గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ అయినా.. […]