వలంటీర్ వ్యవస్థపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తన అక్కసును వెల్లగక్కారు. వలంటీర్ వ్యవస్థ శుద్ధ దండగని వీర్రాజు చెబుతున్నారు. నవరత్నాల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వలంటీర్లు ఓటర్లను బెదిరించారని సోము వీర్రాజు ఆరోపిస్తున్నారు. వలంటర్ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం నెలకు 310 కోట్ల రూపాయలను వృథా చేస్తోందని కూడా చెప్పారు. గ్రామ, వార్డు స్థాయి […]