కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న సామెత మాదిరిగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు పరచకపోగా ఉన్న సంస్థలకు ఎసరుపెడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏపీకి షరాఘాతంలా మారింది. పోరాటాలు, ఆత్మబలిదానాల ద్వారా సాధించుకుని, ఘన చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ఇకపై ప్రైవేటు పరం […]