అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహా నగరంగా ఎదుగుతున్న విశాఖపురికి మరిన్ని కొత్త హంగులు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. విద్య, సాంస్కృతిక, పర్యాటక, రవాణా రంగాల అభివృద్ధికి బాటలు వేస్తోంది. మంగళవారం ఒక్క రోజే సీఎం జగన్ ఆదేశాల మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. పెరిగిన మెట్రో ప్రాంత పరిధి విశాఖను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు […]