పర్యాటక రాజధానిగా భాసిల్లుతున్న విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని అయ్యాక పెరిగే జనాభా, సందర్శకుల రద్దీకి అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యేక ప్రాజెక్టుల మంజూరుకు నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా విశాఖ నుంచి కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వరకు రోడ్ కనెక్టివిటీ పెంచడం.. ఆ మార్గాన్ని పర్యాటక స్వర్గధామంగానూ, ఐటీ కేంద్రంగానూ తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. మంగళవారం జరిగిన […]