మనిషికి రక్తం ఎంత ముఖ్యమో, వ్యవసాయానికి సాగునీరు అంతే ముఖ్యం. రైతులు బాగుండాలేంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయం సాఫీగా సాగాలంటే నీరు ఉండాలి. నీరు లేనిదే వ్యవసాయం లేదు. ఈ పరిస్థితిని తన ప్రజాప్రస్థానం పాదయాత్రలో కళ్లారాచూసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టులు కట్టేందుకు జలయజ్ఞం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి కేవలం మాటల దశలో ఉన్న అనేక ప్రాజెక్టులను, అసాధ్యం అని పూర్వ ముఖ్యమంత్రులు […]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘రైతు కోసం తెలుగుదేశం’ అంటూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నివర్ తుఫాను దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆ పార్టీ చెబుతోంది. నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించిన నారా లోకేష్.. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. త్రిపురాంతకం మండలం ఉమ్మడివరం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకంటూ లోకేష్ బయలుదేరారు. నివర్ తుఫాను వచ్చి పోయి దాదాపు నెల రోజులువుతోంది. పంటలు దెబ్బతిన్న సమయంలో పరిశీలించేందుకు […]
గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబుకు సాటి మరొకరు లేరంటారు. అంతేకాదు అధికారంలో ఉన్నప్పడు అది చేస్తా.. ఇది చేస్తానని చెప్పి.. తీరా అ పనులు చేయకపోవడంతోనే 2019 ఎన్నికల్లో ప్రజలకు బాబుకు గట్టి గుణపాఠం చెప్పారు. అయినా బాబు తీరు మాత్రం మారలేదు. అధికారంలో ఉండి చేయగలిగి ఉన్నా చేయకుండా.. తీరా ప్రజలు కుర్చి నుంచి దింపేసిన తర్వాత.. నేను గాని ఉంటే.. లాంటి మాటలను చంద్రబాబు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. తన వ్యవహార శైలి […]
మరో లాతూర్, జనవరి నెలలో బిందె నీరు 5 రూపాయలు, ఫ్లోరైడ్ వలన బాల్యంలోనే పిల్లలు వృద్దులవుతున్నారు, వెయ్యి, పన్నెండొందల అడుగుల్లో కూడ నీళ్లు పడటం లేదు… ఏమి చెయ్యాలి? ఈ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత అవసరం లేదా? ఈ సమస్యలు పరిష్కారం కోసం నిర్మించతలపెట్టిన నీటి ప్రాజెక్ట్ శిలాఫలకం మరికొద్ది నెలలలో సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది. ఆ శిలాఫలకం వేసిన నేత 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నా దానికి విముక్తి కలగలేదు…మాటలు తప్ప […]
నీరు… కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇది ఓ సాధారణ విషయం. కానీ ఆ ప్రాంత ప్రజలకు ఒక అపురూపం. నీళ్లను చూస్తే వారి మనసు ఉప్పొగుతుంది. ఎందుకంటే అక్కడ సాగునీరే కాదు కనీసం సురక్షితమైన తాగునీటికీ కరువే. ఈ ప్రాంతం ఎక్కడో ఏడారి ప్రాంతంలో లేదు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో కరువుకు మారుపేరైన ప్రకాశం జిల్లాలోనే ఉంది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల ప్రజలకు ఇప్పటికీ సాగు నీరే కాదు కనీసం సురక్షిత […]