ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ స్పష్టమైన వైఖరితో ముందుకెళుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ, అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని టీడీపీ భిన్నమైన స్టాండ్ తీసుకున్నాయి. జనసేన అధినేత అమరావతికి మద్ధతుగా నిలవగా.. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం మూడు రాజధానులకు జై కొట్టారు. రాష్ట్ర బీజేపీలో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నా.. జాతీయ నాయకత్వం మాత్రం రాష్ట్ర రాజధానిగా అమరావతియే కొనసాగాలని కోరుకుంటున్నట్లు […]