కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే శ్రీనివాసుడి తల్లి వకుళమాత ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. వందలఏళ్లపాటు ఆధ్యాత్మిక వెలుగులు నింపి.. తిరుమలకు వెళ్లే ఎందరో భక్తులకు ఆశ్రయమిచ్చి.. ఆకలితీర్చిన ఆ దివ్యధామం ప్రస్తుతం.. మహాసంప్రోక్షణ పనులు జరుపుకుంటోంది. టిటిడి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. వకుళమాత ఆలయంలో గంటకొడితేనే తిరుమలలో ఉన్న కన్నబిడ్డకు నైవేద్యం పెట్టేవారట. తిరుపతికిి 5 కిలోమీటర్ల దూరంలో పేరూరు బండపై ఉందీ 320 ఏళ్ల నాటి పురాతన ఆలయం. అప్పట్లో మైసూరు పాలకుడిగా ఉన్న హైదర్ […]