సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే స్టార్ హీరోలు సందేశాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువ ఇష్టపడరు. కారణం మార్కెట్ లో ఉండే రిస్క్. ఏ మాత్రం అటుఇటు అయినా నిర్మాత నష్టపోతాడు. అయినా కూడా సాహసం చేసేవాళ్ళు లేకపోలేదు. చిరంజీవి రుద్రవీణ, బాలకృష్ణ జననీ జన్మభూమి లాంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నాగార్జునకూ అలాంటి ఎప్పటికీ చెప్పుకునే సినిమా ఉంది. అదే జైత్రయాత్ర. 1979లో థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఉప్పలపాటి నారాయణరావు 1985 మొదలు వంశీ, […]