ప్రతి 12 ఏళ్లకు వచ్చే తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలులో తుంగభద్ర నది వద్దకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య.. తుంగభద్రమ్మకు పలు రకాల హారతులు ఇచ్చి పుష్కరాలను ప్రారంభించారు. వేద పండితులు సీఎం జగన్కు తుంగభద్రమ్మ ఆశీసులు అందించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. పుష్కరాలను నిర్వహిస్తోంది. అందుకు తగినట్లుగా నది […]
ఏపీలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి కొడుకు అదే పీఠంపై కూర్చున్న ఘనతను వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. ఆ క్రమంలోనే అనేక అరుదైన పరిణామాలకు ఆయన సాక్షీభూతం అవుతున్నారు. తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడం, పథకాలను కొత్త పుంతలు తొక్కించడం వంటి అనేక ప్రయత్నాల్లో జగన్ తలమునకలై ఉన్నారు. దానికి కొనసాగింపుగా తుంగభద్ర పుష్కరాల్లో మరో ఘనతను సొంతం చేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి మాత్రమే సాధ్యమయిన అరుదైన విషయంగా ఇది పుష్కరాల చరిత్రలో నిలిచిపోతుంది. […]
కర్నూల్ లో తుంగభద్ర పుష్కరాల నిర్వహణ ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. నదీ స్నానాలకు అనుమతి ఇవ్వకపోయినా భక్తులను ఎంత వరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇక రెండు రోజులే సమయం ఉన్నందున ఏర్పాట్లు కూడా పూర్తి కావొచ్చాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు భక్తుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నాయి. ఈ క్రమంలో భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు కరోనా కేసుల ఉధృతి తగ్గినా ప్రమాదం లేకపోలేదు. బన్నీ ఉత్సవంతో […]