iDreamPost
android-app
ios-app

తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం

తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం

ప్రతి 12 ఏళ్లకు వచ్చే తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. కర్నూలులో తుంగభద్ర నది వద్దకు వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య.. తుంగభద్రమ్మకు పలు రకాల హారతులు ఇచ్చి పుష్కరాలను ప్రారంభించారు. వేద పండితులు సీఎం జగన్‌కు తుంగభద్రమ్మ ఆశీసులు అందించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. పుష్కరాలను నిర్వహిస్తోంది. అందుకు తగినట్లుగా నది వెంబడి ఘాట్లను నిర్మించింది. 2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తుంగభద్ర పుష్కరాలను నిర్వహించగా.. నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తుంగభద్రమ్మ పుష్కరాలను నిర్వహిస్తుండడం గమనార్హం.

Read Also : తుంగభద్ర పుష్కరాలు- వైఎస్ కుటుంబానికే సాధ్యమయిన ఘనత